STOCKS

News


రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి కొత్త బైక్‌

Wednesday 29th August 2018
auto-mobiles_main1535519534.png-19742

బెంగళూరు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ కొత్త మోడల్‌ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. క్లాసిక్‌ సిగ్నల్స్‌ 350 పేరుతో అందిస్తున్న ఈ బైక్‌  ధర రూ.1,58,861గా (ఎక్స్‌ షోరూమ్‌, బెంగళూరు) నిర్ణయించినట్లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌  కంపెనీ బిజినెస్‌ హెడ్‌ (ఇండియా) షాజి కోషే చెప్పారు. ఈ కొత్త బైక్‌ రెండు రంగుల్లో లభ్యమవుతుందని చెప్పారాయన. స్టీల్‌ ఇంజిన్‌ గార్డ్స్‌ వంటి 40 ప్రత్యేక యాక్సెసరీలతో ఈ బైక్‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ బైక్‌ను 346 సీసీ ఎయిర్‌-కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో రూపొందించామని, 5 గేర్లు,  క్రాష్‌ గార్డ్స్‌, పెద్ద విండ్‌స్క్రీన్లు వంటి ప్రత్యేకతలున్నాయని చెప్పారు.
ఐదేళ్లలో 50 శాతానికి మించిన వృద్ధి...
‘‘గత ఐదేళ్లలో 50 శాతానికి మించిన వృద్ధిని సాధించాం. అంతర్జాతీయ మిడ్‌-సైజ్‌ మోటార్‌ సైకిల్‌ మార్కెట్లో ముఖ్యమైన కంపెనీగా ఎదిగాం.  కంపెనీ నిర్వహణలో ఉన్న 17 షోరూమ్‌లతో పాటు 705కు పైగా డీలర్ల ద్వారా  విక్రయాలు జరుపుతున్నాం. అమెరికా, ఇంగ్లాండ్‌, యూరప్‌, లాటిన్‌ అమెరికా, పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలతో సహా మొత్తం 50కు పైగా దేశాలకు మా బైక్‌లు ఎగుమతి చేస్తున్నాం’’ అని షాజీ కోషే వివరించారు. 1950 నుంచి భారత సైనిక దళాలకు ఈ బైక్‌ల సరఫరాలను ప్రారంభించామని, భారత సైన్యానికి అత్యధిక బైక్‌లను సరఫరా చేసిన ఘనత తమదేనని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ ప్రెసిడెంట్‌ రుద్రతేజ్‌ సింగ్‌ తెలిపారు.

.


 



You may be interested

అమెజాన్ పే చేతికి ట్యాప్‌జో

Wednesday 29th August 2018

న్యూఢిల్లీ: దేశీ డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై అమెరికన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ మరింతగా దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో అమెజాన్ పేమెంట్స్ విభాగం అమెజాన్ పే .. బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ ట్యాప్‌జోను కొనుగోలు చేసింది. నగదు, షేర్ల రూపంలో కుదుర్చుకున్న ఈ డీల్‌తో ట్యాప్‌జో విలువను 30- 40 మిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ట్యాప్‌జో కొనుగోలు కోసం ఈ ఏడాది

ఎన్‌సీఎల్‌ఏటీకి వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్ డీల్‌

Wednesday 29th August 2018

న్యూఢిల్లీ: దేశీయ ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికన్ బహుళ ప్రొడక్టుల రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర వేయడంపై ట్రేడర్స్‌ సంఘం- సీఏఐటీ (ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ కాన్ఫెడరేషన్‌) తీవ్రంగా నిరసించింది. దీనికి వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌ఏటీ (నేషనల్‌ కంపెనీ లా అపిలేట్‌ ట్రిబ్యునల్‌)లో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ విషయంలో తమ వాదనలు వినిపించడానికి సీసీఐ తగిన అవకాశం

Most from this category