STOCKS

News


పెరగనున్న రెనో కార్ల ధరలు

Wednesday 12th December 2018
auto-mobiles_main1544591406.png-22843

ముంబై: యూరోపియన్ ఆటో తయారీ దిగ్గజం రెనో తమ కార్ల ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది. జనవరి ఒకటి నుంచి 1.5 శాతం మేర పెంపు ఉండనుందని తెలియజేసింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ముడి పదార్థాల ధరల్లో పెరుగుదల, ఫారెన్‌ ఎక్స్ఛేంజ్‌లో భారీ మార్పులు ఈ ధరల పెంపు నిర్ణయానికి దోహదపడ్డాయని తెలిపింది. రెనో డస్టర్, క్విడ్, లాజీ, క్యాప్టర్ బ్రాండ్లను కంపెనీ భారత్‌లో విక్రయిస్తోంది. మరోవైపు స్కోడా, మారుతీ సుజుకీ, ఇసుజు మోటార్స్‌, టయోటా కిర్లోస్కర్ సంస్థలు కూడా వచ్చే ఏడాది ఒకటవ తేదీ నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. 



You may be interested

మాల్యా నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదు

Wednesday 12th December 2018

న్యూఢిల్లీ: రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా నుంచి సెటిల్మెంట్‌కు సంబంధించి అధికారికంగా తమకు ఎలాంటి ఆఫర్‌ రాలేదని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టంచేశారు. "కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల కన్సార్షియానికి ఎస్‌బీఐ సారథ్యం వహిస్తోంది. మాల్యా భారత్‌కు తిరిగి వస్తే రుణాల రికవరీ ప్రక్రియ వేగం కాగలదని చెప్పారాయన. తీసుకున్న రుణాల్లో అసలును

జెన్‌ఫోన్‌ ఎం2 సిరీస్‌ వచ్చేశాయి

Wednesday 12th December 2018

న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన ప్రముఖ హ్యండ్‌సెట్‌ తయారీ సంస్థ ఆసుస్.. భారత మార్కెట్‌లో మంగళవారం రెండు నూతన సిరీస్‌ స్మోర్ట్‌ఫోన్లను విడుదల చేసింది. 6.26 అంగుళాల డిస్‌ప్లే, 13- మెగాపిక్సెల్‌ కెమెరాలు, 3జీబీ ర్యామ్‌ / 32జీబీ స్టోరేజ్‌, 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన మ్యాక్స్‌ ఎం2 ధర రూ.9,999 కాగా, ఇదే వేరియంట్‌లో 4జీబీ ర్యామ్‌ / 64జీబీ స్టోరేజ్‌ కలిగిన ఫోన్‌ ధర రూ.11,999గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.

Most from this category