STOCKS

News


మార్కెట్లోకి 2019 ‘రెనో కాప్చర్‌’

Tuesday 2nd April 2019
auto-mobiles_main1554180406.png-24919

- ధరల శ్రేణి రూ.9.5లక్షలు–రూ.13లక్షలు

ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘రెనో’ తాజాగా తన ప్రీమియం ఎస్‌యూవీ ‘కాప్చర్‌’ మోడల్‌లో నూతన వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇంతకుముందు కంటే ఈకారులో మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. పాదచారుల భద్రతా ప్రమాణాల వంటి అన్ని రకాల దేశీ భద్రతా చట్టాలకు అనుగుణంగా ఈ నూతన వెర్షన్‌ రూపొందినట్లు తెలిపింది. ధరల శ్రేణి రూ.9.5లక్షలు–రూ.13లక్షలుగా ప్రకటించింది. ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్‌ (ఈబీడీ)తో కూడిన అత్యున్నత బ్రేకింగ్‌ వ్యవస్థ (ఏబీఎస్‌), బ్రేక్ అసిస్టెన్స్, స్పీడ్ అలర్ట్‌, పార్కింగ్ సెన్సార్, డ్రైవర్ పక్కన వ్యక్తి సీట్ బెల్ట్ రిమైండర్‌, రెండు ఎయిర్‌ బ్యాగ్స్‌ వంటి ఫీచర్లు ఉన్నట్లు తెలిపింది.



You may be interested

జీఎస్‌టీ వసూళ్లు రూ.11.77 లక్షల కోట్లు

Tuesday 2nd April 2019

- మార్చిలో రికార్డు స్థాయి వసూళ్లు న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2018-19) వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు రూ.11.77 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈకాలంలో సగటున నెలకు 9.2 శాతం వృద్ధి రేటును సాధించి రూ.98,114 కోట్లుగా నమోదైనట్లు ఆర్థికమంత్రిత్వశాఖ సోమవారం ప్రకటించింది. ఈఏడాది మార్చిలో అత్యధికంగా రూ.1.06 లక్షల కోట్లు వసూళ్లు అయినట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తయారీ, వినియోగం గణనీయంగా

నేటి నుంచీ ఆర్‌బీఐ కీలక సమావేశం

Tuesday 2nd April 2019

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. గురువారం వరకూ మూడు రోజులు ఈ సమీక్షా సమావేశాలు జరుగుతాయి. 4వ తేదీ గురువారం ఆర్‌బీఐ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు. ప్రస్తుతం 6.25 శాతం)పై ప్రకటన వస్తుంది. ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో వృద్ధికి

Most from this category