News


మార్కెట్లోకి రెడ్‌మి నోట్‌ 6 ప్రో

Friday 23rd November 2018
auto-mobiles_main1542948443.png-22329

న్యూఢిల్లీ: చైనాకి చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ షావోమీ తాజాగా భారత మార్కెట్లో రెడ్‌మి నోట్‌ 6 ప్రో ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇందులో 4జీబీ ర్యామ్‌, 64జీబీ మెమరీ ఉండే ఫోన్ ధర రూ.13,999 కాగా, 6జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ. 15,999గా ఉంటుంది. నవంబర్‌ 23న (శుక్రవారం) మి.డాట్‌కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌, మి హోమ్ స్టోర్స్‌లో బ్లాక్‌ ఫ్రైడే సేల్ సందర్భంగా రూ.1,000 డిస్కౌంట్‌పై ఇవి లభిస్తాయి. ముందు రెండు (12 ఎంపీ+5ఎంపీ), వెనుక రెండు (20ఎంపీ+2ఎంపీ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలతో మొత్తం నాలుగు కెమెరాల సెటప్ ఇందులో ఉంటుంది. 6.26 అంగుళాల డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్స్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. 4జీబీ, 6జీబీ ర్యామ్‌లలో రెడ్‌మి నోట్‌ 6 ప్రో లభిస్తుందని షావొమి వైస్‌ ప్రెసిడెంట్ మను జైన్ తెలిపారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడంతో తమ ఉత్పత్తులపై ధరలపరంగా ఒత్తిడి ఉంటోందని ఆయన చెప్పారు. తమ ఫోన్లు, పవర్‌ బ్యాంకులను భారత్‌లోనే తయారు చేస్తున్నప్పటికీ, అవసరమైన ముడి సరుకు, కీలకమైన ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ అసెంబ్లీ (పీసీబీఏ)ని డాలర్లలోనే కొనుగోలు చేయాల్సి వస్తుండటమే ఇందుకు కారణమన్నారు. You may be interested

వచ్చే ఏడాదిలోపు మార్కెట్‌లో రెట్టింపు రాబడి..!

Friday 23rd November 2018

ముంబై: విదేశీ నిధులు తరలివెళ్తునప్పటికీ.. దేశీ నిధులు మార్కెట్‌ను ఆదుకుంటున్నాయని, ప్రత్యేకించి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్‌)ల ద్వారా మార్కెట్‌లోనికి ప్రవేశించే నిధులు గతరెండేళ్లుగా జోరుమీద కొనసాగున్నాయన్నారు టౌరస్‌ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ విభాగం మేనేజర్‌ ప్రసన్న ప్రతీక్‌. ఈ ట్రెండ్‌ మరి కొంతకాలం కొనసాగేందుకు అవకాశం ఉందని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇన్వెస్టర్లకు సిప్‌లపై నమ్మకం పెరగడం, మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో నిబంధనలు సంతృప్తికరంగా ఉండడం, సామాన్యులలో సిప్‌లపై

మళ్లీ కొలువుల  జోరు

Friday 23rd November 2018

న్యూఢిల్లీ: ఉద్యోగాలు వచ్చే ఏడాది జోరుగా రానున్నాయని ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌, 2019  పేర్కొంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఐటీ, వాహన, పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఉద్యోగవకాశాలు ఇబ్బడిముబ్బడిగా రానున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌, హెచ్‌ఆర్‌ టెక్నాలజీ కంపెనీ పీపుల్‌ స్ట్రాంగ్‌, గ్లోబల్‌ టాలెంట్‌ అసెస్‌మెంట్‌ సంస్థ వీబాక్స్‌ సంస్థలు, భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సహకారంతో ఈ నివేదికను రూపొందించాయి. ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు అధిక అవకాశాలుంటాయంటున్న

Most from this category