STOCKS

News


రియల్‌మి 'యు1' స్మార్ట్‌ఫోన్‌

Thursday 29th November 2018
auto-mobiles_main1543470297.png-22474

న్యూఢిల్లీ: చైనాకి చెందిన స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ రియల్‌మి తాజాగా 'యు1' పేరుతో మరో కొత్త ఫోన్‌ను బుధవారం భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధరల శ్రేణి రూ. 11,999 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 5 నుంచి ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్‌ తెలిపారు. 
మీడియాటెక్‌ హీలియో పి70 ప్రాసెసర్‌తో ఈ కేటగిరీలో యు1ను అత్యంత శక్తిమంతమైన సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌గా తీర్చిదిద్దినట్లు వివరించారు. యు1లో 6.3 అంగుళాల స్క్రీన్‌, ముందు వైపు 25 ఎంపీ కెమెరా (సోనీ సెన్సార్స్‌తో), వెనుకవైపు 13 ఎంపీ+2 ఎంపీ డ్యుయల్ కెమెరా తదితర ప్రత్యేకతలు ఉంటాయి. ఇవి 3జీబీ ర్యామ్‌ + 32 జీబీ మెమరీ, 4జీబీ ర్యామ్‌ + 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ వేరియంట్స్‌లో లభిస్తాయి. 



You may be interested

రెన్యూవల్‌ ఎనర్జీలో వాటా విక్రయిస్తాం !

Thursday 29th November 2018

ముంబై:  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) గ్రూప్‌ తన రెన్యూవల్‌ ఎనర్జీ వ్యాపారంలో వాటాను విక్రయించనున్నది. ఈ రెన్యూవల్‌ ఎనర్జీ విభాగంలో భాగంగా ఈ గ్రూప్‌ రెండు పవన విద్యుదుత్పత్తి ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఈ ప్లాంట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం 873.5 మెగావాట్లు. ఇవి కాకుండా 104 మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేసే ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ వ్యాపార విభాగంలో తమకున్న వాటాను విక్రయించే ప్రక్రియను ఆరంభించామని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తెలిపింది.

3 నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల నిరవధిక సమ్మె

Thursday 29th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు డిసెంబర్ 3 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. కొత్త టెల్కో రిలయన్స్ జియోపై ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్న ఆరోపణలే ఇందుకు కారణం. టెలికం సేవల్లో జియోతో పోటీపడకుండా చేసేలా బీఎస్‌ఎన్ఎల్‌కు కేంద్రం 4జీ స్పెక్ట్రం కేటాయించలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. "ప్రస్తుతం మొత్తం టెలికం రంగం అంతా కూడా సంక్షోభంలో ఉంది. ఇదంతా కూడా ముకేశ్ అంబానీ సారథ్యంలోని

Most from this category