STOCKS

News


రియల్‌మి కొత్త ఫోన్‌ ‘యూ1’

Friday 23rd November 2018
auto-mobiles_main1542958944.png-22346

కేవలం నాలుగు స్మార్ట్‌ఫోన్లతోనే తన సత్తా చాటుకున్న చైనాకు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘రియల్‌మి’ మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. నవంబర్‌ 28న ‘యూ1’ అనే కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. సెల్ఫీ కెమెరా ప్రధాన బలంగా కంపెనీ ఈ ఫోన్‌ను ఆవిష్కరించనుంది. అలాగే ఇందులో హీలియో పీ70 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తోంది. ప్రపంచంలోనే ఈ రకం ప్రాసెసర్‌తో వస్తోన్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే. వాటర్‌డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లే మరొక ఆకర్షణ. కాగా హానర్‌ 8ఎక్స్‌, షావోమి రెడ్‌మి నోట్‌ 6 ప్రో స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీనివ్వొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే హానర్‌ 8ఎక్స్‌లో హిసిలికాన్‌ కిరిన్‌ 710 ప్రాసెసర్‌ను, రెడ్‌మి నోట్‌ 6 ప్రోలో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌ను అమర్చారు. ఈ రెండు ప్రాసెసర్ల కన్నా రియల్‌మిలోని హీలియో పీ70 ప్రాసెసర్‌ అధిక బెంచ్‌మార్క్‌ స్కోర్‌ను సాధించింది. ఇకపోతే రియల్‌మి యూ1 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకంగా అమెజాన్‌లో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. 



You may be interested

28 నుంచి కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ బైబ్యాక్‌

Friday 23rd November 2018

ప్రభుత్వ రంగానికి చెందిన నౌకా నిర్మాణ సంస్థ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ తాజాగా షేర్ల బైబ్యాక్‌ తేదీని ప్రకటించింది. నవంబర్‌ 28న బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రారంభమౌతుందని పేర్కొంది. 43.95 లక్షల ఈక్విటీ షేర్లను బైబ్యాక్‌ చేస్తామని, వీటి విలువ రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని తెలిపింది. బైబ్యాక్‌ షేర్లు కంపెనీ మొత్తం ఈక్విటీలో 3.23 శాతం వాటాకు సమానం. ఇక షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌ డిసెంబర్‌ 11న ముగుస్తుంది. ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌

ఈ స్టాక్స్‌కు బై రేటింగ్‌..

Friday 23rd November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా రెండు స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. అవేంటో చూద్దాం..  లుపిన్‌ లుపిన్‌పై పాజిటివ్‌గా ఉన్నాం. బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.960గా నిర్ణయించాం. అమెరికా జనరిక్‌ మారెకట్‌లో తీవ్రమైన పోటీ, ధరల ఒత్తిడి కారణంగా క్యూ2లో కంపెనీ ఫలితాలు అంచనాలకు దిగువునే ఉండిపోయాయి. వార్షికంగా చూస్తే కంపెనీ ఆదాయం ఫ్లాట్‌గానే ఉంది. మార్జిన్లు, నికర లాభం తగ్గాయి. తేవా, మైలాన్‌ సంస్థలు కొన్ని

Most from this category