News


నాచ్‌ డిస్‌ప్లేతో రియల్‌మి-2

Saturday 25th August 2018
auto-mobiles_main1535188495.png-19645

ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘ఒప్పొ’ తీసుకువచ్చిన ‘రియల్‌మి-1’ స్మార్ట్‌ఫోన్‌ ఇటీవల కాలంలో మార్కెట్‌లో బాగా క్లిక్కయ్యింది. అందుబాటు ధరలో, మంచి ఫీచర్ల కారణంగా కస్టమర్లను ఆకర్షించింది. రియల్‌మి-1కి అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా ఇప్పుడు రియల్‌మి-2 స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి వస్తోంది. దీని ప్రారంభ ధర రూ.10,000 దగ్గరిలో ఉండొచ్చని అంచనా. రియల్‌మి-1 కేవలం అమెజాన్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు రాబోయే రియల్‌మి-2 కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. రియల్‌మి-2 గురించి క్లుప్తంగా..

ఫోన్‌: రియల్‌మి-2
ప్రారంభ ధర: దాదాపు రూ.10,000 (అంచనా)
లాంచ్‌: ఆగస్ట్‌ 28
లభ్యత: ఫ్లిప్‌కార్ట్‌లో
ఫీచర్లు: 
    6.2 అంగుళాల స్క్రీన్‌
    ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ నాచ్‌ డిస్‌ప్లే
    ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌
    డ్యూయెల్‌ రియర్‌ కెమెరా
    4,230 ఎంఏహెచ్‌ బ్యాటరీ
    స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌

రియల్‌మి-1లో మీడియాటెక్‌ హీలియో పీ60 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. కంపెనీ ఇప్పుడు రియల్‌మి-2లో స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌ను అమర్చింది. ఇక రియల్‌మి-1లో ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ లేదు. రియల్‌మి-2లో సెన్సర్‌ ఉంటుంది. రియల్‌మి-1 ధర రూ.8,990 నుంచి ప్రారంభమౌతోంది. అలాగే రియల్‌మి-1లో సింగిల్‌ రియర్‌ కెమెరా ఉంటే, ఇప్పుడు రియల్‌మి-2లో డ్యూయెల్‌ రియర్‌ కెమెరా ఉంటుంది. రియల్‌మి-1లో బ్యాటరీ సామర్థ్యం 3,410 ఎంఏహెచ్‌. రియల్‌మి-2లో బ్యాటరీ సామర్థ్యం 4,230 ఎంఏహెచ్‌. 



You may be interested

తుఫాను ముందు నిశ్శబ్దం?

Saturday 25th August 2018

పొంచి ఉన్న భారీ పతనం  అప్రమత్తతే ఆయుధం ఈక్విటీ మార్కెట్లో భారీ కరెక‌్షన్‌ పొంచిఉన్న సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ సమయంలోనైనా నిఫ్టీ ధబేలున కుప్పకూలవచ్చని అంచనా వేస్తున్నారు. కరెక‌్షన్‌ చూపడానికి ముందు మార్కెట్లు ఐదైనా బహిర్గత కారణాన్ని ఎంచుకుంటాయి. అలాంటి కారణం ఇప్పటికి ఇంకా కనిపించనప్పటికీ, కరెక‌్షన్‌కు రెడీగా ఉన్న సిగ్నల్స్‌ మాత్రం బలంగా ఉన్నాయి. ముఖ్యంగా చిన్న స్టాకుల సూచీలు ప్రధాన సూచీలతో పాటు ర్యాలీ చేయడానికి

11620 దాటేస్తే 12వేల వరకు పరుగులు

Saturday 25th August 2018

నిఫ్టీపై అనలిస్టుల అంచనా నిఫ్టీ రాబోయే వారంలో 11620 పాయింట్లకు పైన స్థిరంగా క్లోజయితే తదుపరి 12000 పాయింట్ల వరకు పరుగు ఉంటుందని చార్ట్‌ వ్యూ ఇండియా ప్రతినిధి మజార్‌ మహ్మద్‌ అంచనా వేశారు. అయితే ఈ విధమైన ఎలాంటి ఆరోగ్యకరమైన కరెక‌్షన్‌ లేని ర్యాలీ మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సూచీల్లో అలసట కనిపిస్తోందని, గత ఎనిమిదివారాలుగా ఆపకుండా పరుగులు తీయడంతో చార్టుల్లో బలహీనంగా ఉందని చెప్పారు. ఈ

Most from this category