STOCKS

News


రోడ్లపై కార్ల జోరు!

Tuesday 10th July 2018
auto-mobiles_main1531239504.png-18183

  •  జూన్‌లో వాహన విక్రయాలు 38% జంప్‌
  •  2,73,759 యూనిట్లుగా నమోదు
  •  పదేళ్లలో ఇదే అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి
  •  సియామ్‌ గణాంకాల్లో వెల్లడి

న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ జోరుమీదుంది. జూన్‌ నెలలో ప్యాసింజర్‌ వాహన అమ్మకాల్లో 38 శాతం వృద్ధి నమోదయ్యింది. అటుఇటుగా గత పదేళ్లలో ఇదే అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి. ఆటోమొబైల్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ సమాఖ్య (సియామ్‌) తాజా గణాంకాల ప్రకారం.. 
♦ దేశీ ప్యాసింజర్‌ వాహన (పీవీ) అమ్మకాలు 1,99,036 యూనిట్ల నుంచి 2,73,759 యూనిట్లకు పెరిగాయి. 2009 డిసెంబర్‌ నాటి 50 శాతం వృద్ధి తర్వాత ఇదే అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి. 
♦ దేశీ కార్ల విక్రయాలు 34.21 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,37,012 యూనిట్ల నుంచి 1,83,885 యూనిట్లకు పెరిగాయి. 
♦ ‘జీఎస్‌టీ అమలు నేపథ్యంలో ధరల తగ్గింపు ఉంటుందనే అంచనాలతో ప్రజలు గతేడాది ఇదే నెలలో కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. దీనివల్ల ప్రస్తుతం వృద్ధి రేటు పెరిగింది’ అని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథూర్‌ తెలిపారు. 
♦ యుటిలిటీ వెహికల్స్‌, వ్యాన్ల విక్రయాల్లో వరుసగా 47.11 శాతం, 35.64 శాతం వృద్ధి నమోదయ్యింది. 
♦ మారుతీ సుజుకీ దేశీ ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 44.4 శాతం వృద్ధితో 1,34,036 యూనిట్లకు, హ్యుందాయ్‌ మోటార్‌ విక్రయాలు 20.79 శాతం వృద్ధితో 45,371 యూనిట్లకు పెరిగాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా విక్రయాలు 11.89 శాతం వృద్ధితో 18,092 యూనిట్లకు, టాటా మోటార్స్‌ పీవీ అమ్మకాలు 56.75 శాతం వృద్ధితో 20,610 యూనిట్లకు ఎగశాయి. 
♦ మొత్తం టూవీలర్‌ విక్రయాల్లో 22.28 శాతం వృద్ధి నమోదయ్యింది. 18,67,884 యూనిట్లకు పెరిగాయి. 
♦ మోటార్‌సైకిల్‌ అమ్మకాలు 24.32 శాతం వృద్ధితో 11,99,332 యూనిట్లకు ఎగశాయి. హీరో మోటొకార్ప్‌ దేశీ మోటార్‌సైకిల్‌ విక్రయాలు 16.56 శాతం పెరిగాయి. 6,26,194 యూనిట్లుగా నమోదయ్యాయి. హోండా మోటార్‌సైకిల్‌ అమ్మకాలు 19.89 శాతం వృద్ధితో 1,74,276 యూనిట్లకు పెరిగాయి. బజాజ్‌ ఆటో విక్రయాలు ఏకంగా 85.87 శాతం వృద్ధితో 2,00,949 యూనిట్లకు ఎగశాయి. 
♦ స్కూటర్‌ విక్రయాలు 20.96 శాతం వృద్ధితో 6,01,761 యూనిట్లకు చేరాయి. హోండా మోటార్‌సైకిల్‌ దేశీ స్కూటర్‌ అమ్మకాలు 33.29 శాతం వృద్ధి చెందాయి. 3,61,236 యూనిట్లుగా నమోదయ్యాయి. టీవీఎస్‌ మోటార్స్‌ విక్రయాలు 14.84 శాతం వృద్ధితో 99,107 యూనిట్లకు పెరిగాయి. హీరో మోటొకార్ప్‌ స్కూటర్‌ అమ్మకాలు 15.53 శాతం క్షీణతతో 63,755 యూనిట్లకు తగ్గాయి. 
♦ వాణిజ్య వాహన అమ్మకాలు 41.72 శాతం వృద్ధితో 80,624 యూనిట్లకు ఎగశాయి. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ గ్రూపు @ రూ.10 లక్షల కోట్లు

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ: ఆర్థిక సేవల రంగంలోని ప్రముఖ కార్పొరేట్‌ గ్రూపు హెచ్‌డీఎఫ్‌సీ... మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా రూ.10 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. టాటా గ్రూపు తర్వాత రూ.10 లక్షల కోట్ల మార్కును చేరుకున్న రెండో గ్రూపు హెచ్‌డీఎఫ్‌సీ కావడం గమనార్హం. బ్యాంకింగ్‌, గృహరుణాలు, బీమా ఉత్పత్తులు, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇలా భిన్న రకాల ఆర్థిక సేవల్లో హెచ్‌డీఎఫ్‌సీ గ్రూపు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గ్రూపులో భాగమైన హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు,

ప్యాసింజర్‌ విభాగంలో మారుతీ ఆధిపత్యం

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ: దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’.. దేశీ ప్యాసెంజర్‌ వాహన విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) 52.54 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. టాటా మోటార్స్‌ మార్కెట్‌ వాటా పరంగా హోండా కార్స్‌ను వెనక్కునెట్టి నాల్గో స్థానాన్ని దక్కించుకుంది. ఆటోమొబైల్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ సమాఖ్య (సియామ్‌) ప్రకారం.. ఏప్రిల్‌- జూన్‌ మధ్యకాలంలో మొత్తం దేశీ ప్యాసెంజర్‌ వాహన

Most from this category