కార్ల కంపెనీల ధరల హారన్
By Sakshi

న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగ దిగ్గజ సంస్థలన్నీ జనవరి ఒకటి నుంచి కార్ల ధరల పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలు పెంపు ప్రకటనలు చేశాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఒక్కోక్కటిగా వివరణ ఇస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన అధికారిక సమాచారం ప్రకారం కనీసం 1.5 నుంచి 4 శాతం వరకు కార్లు, ప్యాసింజర్ వాహనాల ధరలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి. నిస్సాన్ మోటార్స్ ఇండియా తమ ప్యాసింజర్ వాహనాల ధరలను 4 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలు పెరిగాయి. ఫారెన్ ఎక్స్ఛేంజ్ రేట్లలో ప్రతికూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ధరల భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నాం. నిస్సాన్, డాట్సన్ ధరలు ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి.’ అని సంస్థ డైరెక్టర్ (సేల్స్ అండ్ కమర్షియల్) హర్దీప్ సింగ్ వ్యాఖ్యానించారు. పెరిగిన కమోడిటీ ధరలు, ఫారెన్ ఎక్స్ఛేంజ్ మార్పులు కారణంగా తమ కార్ల ధరలను 2.5 శాతం పెంచనున్నట్లు ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వినయ్ రైనా వెల్లడించారు. దేశీ ఆటో దిగ్గజం టాటా మోటార్స్.. మోడల్‌ను బట్టి గరిష్ఠంగా రూ.40వేల వరకూ ఉండొచ్చని తెలియజేసింది. ‘‘పెరిగిన ముడి పదార్థాల ధరలు, మారిన మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఈ పెంపు తప్పటం లేదు’’ అని కంపెనీ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ తెలిపారు. మరోవైపు రెనో, మారుతీ సుజుకీ, ఇసుజు మోటార్స్, టయోటా కిర్లోస్కర్ సంస్థలు కూడా జనవరి 1 నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.
You may be interested
అదానీ చేతికి ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్
Friday 14th December 2018న్యూఢిల్లీ: ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ (ఏడీటీఎల్) కంపెనీని అదానీ ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేసింది. ఏడీటీఎల్ను తమ పూర్తి అనుబంధ సంస్థ అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ రూ.400 కోట్లకు కొనుగోలు చేసిందని అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.290.37 ప్రీమియమ్‌తో మొత్తం 1.33 కోట్ల షేర్లను కొనుగోలు చేశామని పేర్కొంది. ఆల్ఫా డిజైన్ కంపెనీ రక్షణ సంబంధిత పరికరాల రూపకల్పన,
జీడీపీ వృద్ధికి ఎగుమతులు కీలకం
Friday 14th December 2018ముంబై: 2025 నాటికి భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే ఎగుమతులు గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వృద్ధి లక్ష్యాల సాధనలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు గత నాలుగేళ్లలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, రెరా, జీఎస్టీ, ఐబీసీ వంటి సంస్థాగత సంస్కరణలు ఇందులో భాగమేనని