STOCKS

News


మార్కెట్లోకి పోర్షే ‘కయన్‌’ నూతన ఎడిషన్‌

Thursday 18th October 2018
auto-mobiles_main1539834464.png-21260

ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే.. భారత మార్కెట్‌లో ‘కయన్‌’ నూతన ఎడిషన్‌ను బుధవారం విడుదలచేసింది. మూడు వేరియంట్లలో విడుదలైన ఈ ఎస్‌యూవీ ధరల శ్రేణి రూ.1.19 కోట్లు–రూ.1.90 కోట్లు మధ్య ఉన్నట్లు ప్రకటించింది. ప్రారంభ మోడల్‌ ధర రూ.1.19 కోట్లు, ఈ-హైబ్రిడ్‌ ధర రూ.1.58 కోట్లు, టర్బో ధర రూ.1.90 కోట్లుగా వెల్లడించింది. వీ6, వీ8 పెట్రోల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో కారు విడుదలైంది. ఈ సందర్భంగా సంస్థ ఇండియా డైరెక్టర్‌ పవన్ షెట్టి మాట్లడుతూ.. ‘భారత్‌లో అత్యంత అధికంగా అమ్ముడవుతున్న కయన్‌  మోడల్‌ కారులో తాజాగా మూడవ జనరేషన్‌ను విడుదలచేశాం. ఇప్పటికే 100 బుకింగ్స్‌ జరిగాయి. మరో మూడు నెలల్లో వీరికి కార్లను అందిస్తాం. ఇక మార్కెట్‌ పరంగా గడిచిన రెండు నెలలుగా సవాళ్లను ఎదుర్కుంటున్నాం. ఇంధన ధరలు పెరగడం, రూపాయి బలహీన పడడం వంటి ప్రతికూల అంశాలు ఉన్నాయి. భారత్‌లో పూర్తి ఏడాది వృద్ధి రేటు 6–7 శాతం ఉండవచ్చని అంచనావేస్తున్నాం. తరచూ ప్రభుత్వ విధానాలు మారుతుండడం వల్ల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. సుస్థిర విధానం ఉంటే వృద్ధిరేటు వేగంగా ఉంటుంది కనుక ఆదిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం మంచిదని భావిస్తున్నాం.’ అని వ్యాఖ్యానించారు.
 



You may be interested

లాభాల్లో రిలయన్స్‌ కొత్త రికార్డు

Thursday 18th October 2018

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌)... ఈ ఆర్థిక సంవత్సరం జూలై- సెప్టెంబర్‌ త్రైమాసిక లాభంలో 17 శాతం వృద్ధిని నమోదు చేసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.9,516 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.8,109 కోట్లతో పోలిస్తే 17 శాతం వృద్ధి చెందగా, ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంతో పోల్చి చూస్తే మాత్రం 0.6 శాతమే పెరిగినట్టు లెక్క. విశ్లేషకులు

‍అదానీ గ్రూప్‌తో టోటల్ జట్టు

Thursday 18th October 2018

 న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రా దిగ్గజం అదానీ గ్రూప్‌తో ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎస్‌ఏ చేతులు కలిపింది. ఈ ఒప్పందం కింద దేశవ్యాప్తంగా ఇంధనాల రిటైల్ నెట్‌వర్క్‌ ఏర్పాటు, ద్రవీకృత సహజ వాయువు దిగుమతి టెర్మినల్‌ అభివృద్ధి చేయనుంది. ఒడిషాలోని ధమ్రాలో ఏటా 5 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉండే టెర్మినల్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఇరు సంస్థలు జారీ చేసిన ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. అలాగే, వచ్చే పదేళ్లలో దేశవ్యాప్తంగా

Most from this category