STOCKS

News


మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ‘ఎక్స్‌1’

Friday 5th October 2018
auto-mobiles_main1538713526.png-20873

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్‌మేకర్‌ బీఎండబ్ల్యూ... భారత మార్కెట్‌లో గురువారం ‘ఎక్స్‌1’ పెట్రోల్‌ వేరియంట్‌ను విడుదల చేసింది. కేవలం 7.6 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈ శక్తివంతమైన కారు ధర రూ.37.5 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. గరిష్ట స్పీడు గంటకు 224 కి.మీ కాగా, ఇంతటి వేగానికి తగిన భద్రతా వ్యవస్థను కూడా ఈ కారులో మెరుగుపరిచినట్లు వెల్లడించింది. ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), కార్నరింగ్‌ బ్రేక్‌ కంట్రోల్‌ (సీబీసీ), డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్‌ (డీఎస్‌సీ) వంటి అత్యధునిక భద్రతా ఫీచర్లు ఉన్నట్లు తెలిపింది. బీఎస్-సిక్స్‌ నిబంధనలకు సరిపోయే విధంగా రెండు లీటర్ల ఫోర్‌ సిలెండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చినట్లు కంపెనీ ఈ వెల్లడించింది. 



You may be interested

ఎంఎఫ్‌ నిర్వహణ ఆస్తులు 14% అప్‌

Friday 5th October 2018

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్ (ఎంఎఫ్‌) పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) విలువ ఆశాజనక వృద్ధిరేటును నమోదుచేసింది. జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో 14 శాతం వృద్ధి చెంది రూ.24 లక్షల కోట్లకు చేరినట్లు అసోసియేష‌న్ ఆఫ్ మ్యూచువ‌ల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) నివేదిక ద్వారా వెల్లడైంది. క్రితం ఏడాది ఇదేకాలంలో దేశీ ఎంఎఫ్‌ల ఏయూఎం రూ.21 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ అంశంపై స్పందించిన ఎంఎఫ్‌ పరిశ్రమ వర్గాలు..

ఫోర్బ్స్‌ జాబితాలో మనోళ్లు ముగ్గురు!

Friday 5th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: భారతదేశంలో ఈ ఏటి శ్రీమంతులంటూ ఫోర్బ్స్‌ వెలువరించిన జాబితాలో మళ్లీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీయే అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. దాదాపు రూ.3.4 లక్షల కోట్ల సంపదతో ఆయన నెంబర్‌-1 స్థానంలో నిలిచారు. నిజానికి లిస్టెడ్‌ కంపెనీ అయిన రిలయన్స్‌... గత కొద్ది రోజుల్లోనే ఏకంగా 20 శాతం వరకూ పతనమయింది. ఫోర్బ్స్‌ జాబితా గనక ఇప్పుడు వెలురించి ఉంటే ఆయన సంపద రూ.3 లక్షల

Most from this category