STOCKS

News


ఒప్పొ ట్రిపుల్‌ కెమెరా స్మార్ట్‌ఫోన్‌.. ధరెంతో తెలుసా?

Wednesday 5th December 2018
auto-mobiles_main1543997532.png-22663

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘ఒప్పొ’ తాజాగా మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ ‘ఆర్‌17 ప్రో’ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. కంపెనీ నుంచి ఆర్‌ సిరీస్‌లో వస్తోన్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే. ఇందులో 6.4 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఫ్లస్‌ అమోల్డ్‌ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ లెవెల్‌ 6 ప్రొటెక‌్షన్‌, వాటర్‌డ్రాప్‌ నాచ్‌, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 710 ప్రాసెసర్‌, 128 జీబీ మెమరీ, 8 జీబీ ర్యామ్‌ వంటి ప్రత్యేకతలున్నాయి. ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో కలర్‌ ఓఎస్‌ 5.2 ఇంటర్‌ఫేస్‌ ఉంటుంది. ఫోన్‌ వెనుక భాగంలో మూడు సెన్సర్లు (12 ఎంపీ+ 20 ఎంపీ+టీఓఎఫ్‌ 3డీ స్టీరియో కెమెరా సెన్సార్‌), ముందు భాగంలో 25 ఎంపీ కెమెరా ఉంటుంది. కంపెనీ ఇందులో 3,700 సూపర్‌ వీఓఓసీ టెక్నాలజీ ఫీచర్‌తో కూడిన ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చింది. అంటే 10 నిమిషాల్లో 40 శాతం బ్యాటరీ ఫుల్‌ అవుతుంది. అలాగే ఫోన్‌లో ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఉంటుంది. ఒప్పొ ఆర్‌17 ప్రో ధర రూ.45,990గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు డిసెంబర్‌ 7 నుంచి ప్రారంభమౌతాయి. కంపెనీ ఒప్పొ ఆర్‌17 ప్రోతోపాటు ఆర్‌17 అనే మరొక వేరియంట్‌ను కూడా మార్కెట్‌లో ఆవిష్కరించింది. అయితే ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది. దీని ధర రూ.34,990గా ఉంది. ఇందులో డ్యూయెల్‌ కెమెరా (16 ఎంపీ+ 5 ఎంపీ), 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 670 ప్రాసెసర్‌ వంటి ప్రత్యేకతలున్నాయి. 



You may be interested

స్వల్పకాలానికి 5 స్మాల్‌క్యాప్‌ సిఫార్సులు

Wednesday 5th December 2018

ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, బ్రెగ్జిట్‌పై యూకే పార్లమెంట్‌ ఓటింగ్‌, ఫెడ్‌ సమావేశం, ఒపెక్‌ మీటింగ్‌ వంటి అనేక మార్కెట్‌ ప్రభావిత అంశాలు వరుసగా ఉన్నందున ఫార్మా రంగం షేర్లు ఒడిదుడుకులకు లోనుకావచ్చని మోనార్క్‌ నెట్‌వర్క్‌ క్యాపిటల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ అర్పన్‌ షా అన్నారు. అయితే, సిప్లా, అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ ప్రస్తుతం పెట్టుబడులకు సూచింపదగిన షేర్లుగా ఉన్నట్లు ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో

నష్టాల్లో ఫార్మా షేర్లు

Wednesday 5th December 2018

కీలక వడ్డీరేట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం కోసం ఇన్వెస్టర్ల నిరీక్షణ నేపథ్యంలో మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి నష్టాలతో ట్రేడ్‌ అవుతోంది. సూచీల నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా ఫార్మా షేర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఎన్‌ఎస్‌స్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:00లకు ఫార్మా ఇండెక్స్‌ గతముగింపుతో పోలిస్తే 1.25శాతం నష్టంతో 8,955.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలోకి మొత్తం10 షేర్లలో

Most from this category