STOCKS

News


ఒప్పొ ‘ఫైండ్‌ ఎక్స్‌’.. ఎందుకంత స్పెషల్‌?

Saturday 14th July 2018
auto-mobiles_main1531543452.png-18309

  • ధర రూ.59,999

స్మార్ట్‌ఫోన్స్‌ ప్రియులు ఇప్పుడు ‘ఫైండ్‌ ఎక్స్‌’ గురించే మాట్లాడుకుంటున్నారు. చైనాకు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ఒప్పొ దీన్ని ఆవిష్కరించింది. టాప్‌ టెక్‌ ప్రత్యేకతలతో ఈ ఏడాది మార్కెట్‌లోకి వచ్చిన, వస్తోన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్లలో ఇదే టాప్‌ అని చెప్పుకోవచ్చు. ఇందులోని ప్రత్యేకమైన ఫీచర్‌ ఆటోమేటెడ్‌ మోటొరైజ్‌డ్‌ పాప్‌-అప్‌ కెమెరా. ఇందులోనే ఫ్రంట్‌, రియర్‌ కెమెరాలు ఉంటాయి. హ్యాండ్‌సెట్‌ అన్‌లాక్‌ సమయంలో,  కెమెరా యాప్‌ ఓపెన్‌ చేసినా ఈ పాప్‌అప్‌ కెమెరా పైకి వస్తుంది. మళ్లీ లోనికి వెళ్తుంది. ఫోన్‌లోని మరో ప్రత్యేకత స్క్రీన్‌-టు-బాడీ రేషియో. ఇందులో బెజిల్‌లెస్‌ డిస్‌ప్లే ఉంటుంది. అంటే స్క్రీన్‌ మొత్తం డిస్‌ప్లే వస్తుంది. నాచ్‌ ఉండదు. అలాగే ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ కూడా లేదు. దీని ధర రూ.59,999. 
ఒప్పొ ఫైండ్‌ ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌లో 6.24 అంగుళాల ఓఎల్‌ఈడీ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే (1080x2340 పిక్సెల్‌ రెజల్యూషన్‌), గొరిల్లా గ్లాస్‌ 5 ప్రాటెక‌్షన్‌, ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో, ఆక్టాకోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌, 8 జీబీ ర్యామ్‌, 256 బీజీ మెమరీ, 3,730 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌, డ్యూయెల్‌ రియర్‌ కెమెరా (16 ఎంపీ+ 20 ఎంపీ), 25 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్ట్‌ 3 నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ నెల 25 నుంచి ప్రి-ఆర్డర్‌ ఇవ్వొచ్చు. 



You may be interested

ఏయూస్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులో వాటా విక్రయం

Saturday 14th July 2018

ముంబై:- నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఏయూస్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులో ఇంటర్‌నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ వాటాను విక్రయించింది. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా 1.2శాతానికి సమానమైన 32లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు శుక్రవారం బీఎస్‌ఈ డాటా తెలిపింది. ఈ లావాదేవీ మొత్తం విలువ రూ.201.6 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం చివరికి ఐఎఫ్‌సీ సంస్థకు ఏయూస్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులో 7.95శాతం వాటాను కలిగి ఉంది. ఇప్పుడు ఈ

5 నెలలు.. 30-80 శాతం రాబడి..

Saturday 14th July 2018

ఈ ఏడాది జనవరి 29న బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇన్‌ట్రాడేలో 36,443 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ట్రేడర్లు ప్రాఫిట్‌ బుక్‌ చేసుకోవడంతో అమ్మకాల ఒత్తిడి కారణంగా గత ఐదు నెలలుగా పడుతూ లేస్తూ  వచ్చిన సెన్సెక్స్‌ ఇన్‌ట్రాడేలో గత వారం జూలై 13 శుక్రవారం రోజున మళ్లీ జీవిత కాల గరిష్ట స్థాయి 36,740 పాయింట్లని తాకింది. అంటే జనవరి 29 నుంచి జూలై 12 వరకు చూసుకుంటే సెన్సెక్స్‌లో

Most from this category