STOCKS

News


నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌ @ .26,999

Wednesday 12th December 2018
auto-mobiles_main1544592358.png-22856

 హైదరాబాద్‌: హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌ కంపెనీ నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ నెల 21 నుంచి ఈ ఫోన్ల విక్రయాలు ప్రారంభమవుతాయని, అమెజాన్‌, నోకియా ఇండియా వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చని హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌ పేర్కొంది. సోమవారం నుంచే వినియోగదారులు ఈ ఫోన్లను ఆర్డర్‌ చేయొచ్చు. దీని ధర రూ.26,999. ఆండ్రాయిడ్‌ 9.ఓ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 6.18 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే, డిజిటల్‌​ వెల్‌బీయింగ్‌, ఆడాప్టివ్‌ బ్యాటరీ,  క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 710 ప్రాసెసర్‌, 4 జీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ఆప్షన్‌,  400 జీబీ వరకూ సపోర్ట్‌ చేసే మైక్రోఎస్‌డీ కార్డ్‌, 3500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. 



You may be interested

రూ.160 కోట్లు సమీకరించిన హీరో ఎలక్ట్రిక్‌

Wednesday 12th December 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌ తాజాగా రూ.160 కోట్ల నిధులను సమీకరించింది. ముంబైకి చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ అల్ఫా క్యాపిటల్‌ అడ్వైజరీ ఈ పెట్టుబడులు పెట్టిందని.. దీంతో హీరో ఎలక్ట్రిక్‌లో కొంత వాటా ఈ సంస్థకు దక్కుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త ఉత్పత్తులు, రీసెర్చ్, టెక్నాలజీ మీద ఈ నిధులను వెచ్చిస్తామని హీరో ఎలక్ట్రిక్‌

వ్యవస్థలోకి రూ. 10వేల కోట్లు: ఆర్‌బీఐ

Wednesday 12th December 2018

ముంబై: బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్ల ద్వారా (ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ - ఓఎంవో) రిజర్వ్ బ్యాంక్ వ్యవస్థలోకి రూ. 10,000 కోట్లను పంపిస్తోంది. డిసెంబర్‌ 13న (గురువారం) ఈ లావాదేవీలు నిర్వహించనున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం దరిమిలా.. రిజర్వ్ బ్యాంక్‌ గతవారమే ఆర్థిక వ్యవస్థలోకి రూ. 10,000 కోట్లు పంపింది. లిక్విడిటీ అవసరాలను మదింపు చేసిన తర్వాత డిసెంబర్‌లో మొత్తం రూ.40,000 కోట్ల

Most from this category