STOCKS

News


నిస్సాన్ నుంచి కొత్త మైక్రా

Thursday 9th August 2018
auto-mobiles_main1533792264.png-19075

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ ఇండియా తాజాగా కాంపాక్ట్ కారు మైక్రాలో అప్‌డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 5.03 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూం). ఇది పెట్రోల్‌, డీజిల్ వేరియంట్స్‌లో లభిస్తుంది. డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్‌, స్పీడ్ వార్నింగ్ డివైజ్, స్పీడ్ సెన్సింగ్ డోర్‌ లాక్‌, డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ మొదలైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయని నిస్సాన్ మోటర్ ఇండియా డైరెక్టర్ హర్‌దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. 



You may be interested

ఇండియన్ బ్యాంక్ లాభం 44% డౌన్‌

Thursday 9th August 2018

చెన్నై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ లాభం 44 శాతం క్షీణించి రూ.209 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో సంస్థ లాభం 372 కోట్లు. ఏప్రిల్‌-జూన్ త్రైమాసికంలో బ్యాంకు ఆదాయం రూ. 4,788 కోట్ల నుంచి 5,132 కోట్లకు పెరిగింది. మరోవైపు, స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) 7.21 శాతం నుంచి స్వల్పంగా 7.20 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు

‘పార్శ్వనాథ్‌’ ఖాతాల ఫోరెన్సిక్ ఆడిట్!

Thursday 9th August 2018

 న్యూఢిల్లీ: భారీగా 'డొల్ల కంపెనీలు'న్నట్టుగా అనుమానిస్తున్న సంస్థల జాబితాలో ఉన్న పార్శ్వనాథ్‌ డెవలపర్స్‌ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. కొన్ని వ్యాపార లావాదేవీల్లో కంపెనీ తీరు సందేహాస్పదంగా ఉన్నట్లు తేలడంతో ఈ మేరకు సెబీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2009-10 నుంచి 2011-12 మధ్య కాలానికి సంబంధించిన కాంట్రాక్టులు/ సబ్ కాంట్రాక్టులకు మాత్రమే ఈ విచారణ పరిమితమని పేర్కొంది. వ్యాపార, ఆర్థిక

Most from this category