STOCKS

News


టాటా 'టిగోర్‌' విడుదల

Thursday 11th October 2018
auto-mobiles_main1539231572.png-21030

న్యూఢిల్లీ: కాంపాక్ట్‌ సెడాన్‌ కారు టిగోర్‌ అధునాతన వెర్షన్‌ను టాటా మోటార్స్‌ మంగళవారం విడుదల చేసింది. పెట్రోల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.5.20లక్షలు–6.65 లక్షలు కాగా, ఇందులో 1.2 లీటర్ల ఇంజిన్‌ అమర్చినట్లు కంపెనీ ప్రకటించింది. డీజిల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.6.09 లక్షలు–7.38 లక్షలుగా నిర్ణయించామని, 1.05 లీటర్ల ఇంజిన్‌తో ఈ సెడాన్‌ అందుబాటులో ఉంటుందని టాటా మోటార్స్‌ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గుంటెర్‌ బుషెక్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రీమియం కస్టమర్ల విభాగంలో కాంపాక్ట్‌ సెడాన్‌ అత్యంత ముఖ్యమైన స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఉత్తమ విలువైన, ఆకర్షణీయమైన ఈ వెర్షన్‌ను మార్కెట్‌లో విడుదలచేశాం.’ అని అన్నారయన.



You may be interested

టాప్‌ గేర్‌లో మారుతి సియాజ్

Thursday 11th October 2018

న్యూఢిల్లీ: ప్రీమియం సెడాన్‌ విభాగంలో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) సియాజ్ టాప్‌ గేర్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి అర్థభాగంలో 24,000 కార్ల విక్రయం నమోదైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ క్యాటగిరీలో 28.8 శాతం మార్కెట్‌ వాటాను కలిగిఉన్నట్లు సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్. కల్సీ వెల్లడించారు. 2014లో విడుదలైన సెడాన్‌.. ఇప్పటివరకు 2.34 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. ఆగస్టులో విడుదలైన వెర్షన్‌ బుకింగ్స్‌

మహిళల సేఫ్టీ కోసం వొడాఫోన్‌ సఖి

Thursday 11th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా ‘వొడాఫోన్‌ సఖి’ పేరుతో మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని మొబైల్‌ ఆధారిత సేఫ్టీ సర్వీసులను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. బ్యాడ్మింటన్‌ స్టార్‌ పి.వి.సింధు చేతుల మీదుగా సఖిని ఆవిష్కరించారు. ఫోన్లో బ్యాలెన్స్‌, ఇంటర్నెట్‌ లేకున్నా ఈ ఉచిత సేవలు పనిచేయడం విశేషం. సఖి సర్వీసులకై 1800123100 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయాల్సి ఉంటుంది. అత్యవసర సమయంలో కస్టమర్‌ ఉన్న ప్రాంతం (లొకేషన్‌) వివరాలు

Most from this category