STOCKS

News


‘మోటో జీ6 ప్లస్‌’ వచ్చేసింది

Tuesday 11th September 2018
auto-mobiles_main1536642037.png-20152

న్యూఢిల్లీ: వేగవంతమైన చార్జింగ్‌ సదుపాయం, అత్యాధునిక కెమెరా టెక్నాలజీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను మోటొరోలా మార్కెట్‌లో ఆవిష్కరించింది.  ‘మోటో జీ6 ప్లస్‌’ పేరిట సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌.. 6జీబీ ర్యామ్‌, 64 అంతర్గత మెమొరీ, 5.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు మోటొరోలా వెల్లడించింది. వెనుకవైపు 12, 5 మెగాపిక్సెల్ డ్యుయల్‌ కెమెరాలు, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ లెన్స్‌ అనుసంధానించటం వల్ల ఫోటోల్లో మరింత స్పష్టత, ల్యాండ్‌మార్క్‌ గుర్తింపు నాణ్యత ఉంటుందని వివరించింది. 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, టర్బోవపర్‌ చార్జర్‌ ఉన్న ఈ ఫోన్‌ వేగంగా చార్జింగ్‌ అవుతుందని తెలిపింది. ప్రారంభ ఆఫర్‌ కింద పేటీఎం మాల్‌, మోటో హబ్‌, అమెజాన్‌లో పలు ఆఫర్లను ఇస్తున్నట్లు లెనోవో అనుబంధ సంస్థ మోటొరోలా ప్రకటించింది.



You may be interested

అక్టోబర్‌ నుంచీ భారత్‌ ‘ఆర్థికం’ మందగమనం!

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్థభాగం (అక్టోబర్‌-మార్చి)లో మందగించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- యూబీఎస్‌ అంచనావేస్తోంది. తాజా నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే...  ద్రవ్య పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి. భారీ స్థాయిలో క్రూడ్‌ ధరలు, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమనం దీనికి కారణం.   ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే అక్టోబర్‌-మార్చి మధ్య కాలంలో 7

సెజ్‌ల అభివృద్ధికి సమయం పెంచాలి: డెవలపర్లు

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్లు(సెజ్‌లు) అభివృద్ధికి మరింత సమయం కావాలని మొత్తం 13 ఎస్‌ఈజెడ్‌ డెవలపర్లు వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరారు. జీ పీ రియల్టర్స్, జేబీఎఫ్ పెట్రోకెమికల్స్, అరబిందో ఫార్మాలు ఈ జాబితాలో ఉండగా.. ఈనెల 12న (బుధవారం) వాణిజ్య కార్యదర్శి అధ్యక్షతన జరిగే స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ సమావేశంలో బోర్డ్‌ ఆఫ్‌ అప్రూవల్స్‌ తుది నిర్ణయం వెలువడనుంది. ఇప్పటివరకు తొమ్మిది సార్లు గడువుతేదీ పెంపు అనుమతి పొందిన

Most from this category