STOCKS

News


స్మార్ట్‌ఫోన్స్‌పై అదిరే అఫర్లివే..

Saturday 6th October 2018
auto-mobiles_main1538816785.png-20924

మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీలు వాటి స్మార్ట్‌ఫోన్లపై మెగా డిస్కౌంట్‌ను ప్రకటించాయి. అక్టోబర్‌ 11న ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్‌లో ధరలను 62 శాతం వరకు తగ్గిస్తున్నట్లు పేర్కొన్నాయి. 

► దిగ్గజ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ శాంసంగ్‌ తన గెలాక్సీ ఎస్‌8పై రూ.20,000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇది రూ.29,990కి లభ్యం కానుంది. ప్రస్తుతం దీని ధర రూ.45,990గా ఉంది. కాగా కంపెనీ ఈ మోడల్‌ను రూ.49,990 ధరతో మార్కెట్‌లో ఆవిష్కరించింది. 
► పానాసోనిక్‌ తన 4జీ స్మార్ట్‌ఫోన్‌ పీ91ను రూ.2,990కి విక్రయించనుంది. దీని ధర ప్రస్తుతం అమెజాన్‌లో రూ.3,999గా ఉంది. కంపెనీ ఈ మోడల్‌ను రూ.7,990 ధరతో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.
► హువావే హానర్‌ బ్రాండ్‌ తన స్మార్ట్‌ఫోన్లపై రూ.500-రూ.8,000 శ్రేణిలో తగ్గింపును ప్రకటించింది. హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ హానర్‌ 10ను రూ.8,000 డిస్కౌంట్‌తో రూ.24,999కి అందిస్తోంది. హానర్‌ 9ఎన్‌పై రూ.4,000 తగ్గింపు ప్రకటించింది. 
► ఆసస్‌ కూడా ఇటీవల మార్కెట్‌లోకి కొత్తగా తీసుకువచ్చిన తన స్మార్ట్‌ఫోన్లను రూ.1,000- రూ.5,000 వరకు తగ్గింపుతో విక్రయించనుంది. 
► రూ.10,000లోపు బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో రియల్‌మి, ఇన్‌ఫినిక్స్‌, ఒప్పొ సంస్థలు వాటి పలు మోడళ్లపై రూ.4,000 వరకు తగ్గింపు ప్రకటించాయి. 
► లెనొవొ కే8 ప్లస్‌ రూ.6,999లకే అందుబాటులో ఉండనుంది.
► మోటో జెడ్‌2 స్మార్ట్‌ఫోన్‌ 50 శాతం డిస్కౌంట్‌తో రూ.17,499కి, మోటో ఎక్స్‌4 రూ.10,999కి, మోటో జెడ్‌2 ప్లే రూ.9,999కి అందుబాటులో ఉంటాయి. 



You may be interested

9800 పాయింట్ల వరకు పతనం?!

Saturday 6th October 2018

నిఫ్టీ చార్టుల్లో ఇండికేటర్లు ‘సెల్‌’ సంకేతాలు ఇస్తున్నాయని, అందువల్ల మధ్యకాలానికి నిఫ్టీలో అమ్మకాలు కొనసాగుతాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌  అంచనా వేసింది. నెలవారీ చార్టుల్లో బేరిష్‌ ఎంగల్ఫింగ్‌ క్యాండిల్‌ ఏర్పడిందని తెలిపింది. ఈ క్యాండిల్‌ సాధారణంగా మరింత బలహీనతకు చిహ్నమని తెలిపింది. దీంతో పాటు నిఫ్టీ కీలకమైన 200 రోజుల డీఎంఏ కన్నా దిగువన క్లోజయిందని అందువల్ల రికవరీ అవకాశాలు కనిపించడంలేదని తెలిపింది. వరుసగా నిఫ్టీ రెండు రోజుల పాటు 200

వ్యాల్యు పిక్‌: ఏసియన్‌ పెయింట్స్‌

Saturday 6th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఏసియన్‌ పెయింట్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  స్టాక్‌: ఏసియన్‌ పెయింట్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.1,209 టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,471 ఆనంద్‌రాఠి.. ఏసియన్‌ పెయింట్స్‌పై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వచ్చే ఏడాది కాలానికి గానూ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,471గా నిర్ణయించింది. ‘దేశీ పెయింట్‌ కంపెనీల్లో ఏసియన్‌ పెయింట్స్‌ దిగ్గజ కంపెనీ. ఆసియాలో మూడో అతిపెద్ద పెయింట్‌ కంపెనీ. గ్రూప్‌

Most from this category