STOCKS

News


మెర్సిడెస్‌ బెంజ్‌ కొత్త తరం సి-క్లాస్‌ కారు

Friday 21st September 2018
auto-mobiles_main1537504358.png-20429

ముంబై: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తాజాగా సి-క్లాస్‌లో కొత్త తరం కార్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణమైన డీజిల్ ఇంజిన్‌తో ఇది పనిచేస్తుంది. ఇందులో సి 220డి ప్రైమ్ ధర రూ. 40 లక్షలు, సీ 220డి ప్రోగ్రెసివ్‌ రేటు రూ. 44.25 లక్షలు, టాప్ ఎండ్‌ సి 300డి ఏఎంజీ ధర రూ. 48.50 లక్షలుగా ఉంటుందని మెర్సిడెస్ బెంజ్ వెల్లడించింది. ప్రస్తుత సి-క్లాస్‌తో పోలిస్తే లేటెస్ట్ కారులో దాదాపు 50 శాతం మేర కొత్త మార్పులు చేసినట్లు, 6,500 పైచిలుకు కొత్త విడిభాగాలు ఇందులో ఉపయోగించినట్లు వివరించింది. సి 220డి విక్రయాలు గురువారం నుంచి ప్రారంభం అయినట్లు, సి 300డి అమ్మకాలు మాత్రం డిసెంబర్ త్రైమాసికంలో ప్రారంభం కానున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ జాప్‌ తెలిపారు. భారత మార్కెట్లో ప్రవేశపెట్టినప్పట్నుంచి ఇప్పటిదాకా 30,500 పైచిలుకు సి-క్లాస్ కార్లు యూనిట్లు అమ్ముడయ్యాయని, ఇక్కడ తమకు అత్యధిక విక్రయాలు ఉన్న టాప్‌ మోడల్స్‌లో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు. 



You may be interested

సెబీకి టి అండ్‌ టీ ఇన్‌ఫ్రా ఐపీఓ పత్రాలు

Friday 21st September 2018

న్యూఢిల్లీ: నిర్మాణ రంగ కంపెనీ టీ అండ్‌ టీ ఇన్‌ఫ్రా ఐపీఓకు వస్తోంది. ఈ కంపెనీ ఐపీఓ సంబంధిత పత్రాలను ఇటీవలే మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓలో భాగంగా  ఈ కంపెనీ 75 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ చేయనున్నది. ముందస్తు ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా  రూ.20 కోట్లు సమీకరించాలని కూడా ఈ కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను సాధారణ వ్యాపార

వాట్సాప్‌నకు మూడో నోటీసుపై కేంద్రం యోచన

Friday 21st September 2018

న్యూఢిల్లీ: మెసేజీల జాడ కనుక్కునే సాంకేతికతను అమలు చేయాలంటూ మెసెంజర్‌ సేవల సంస్థ వాట్సాప్‌నకు మూడోసారి నోటీసు ఇవ్వాలని కేంద్ర ఐటీ శాఖ యోచిస్తోంది. దీనిపై అంతర్గతంగా చర్చ జరిగినట్లు, వచ్చే వారం, పది రోజుల్లో వాట్సాప్‌నకు మూడోసారి నోటీసులు పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాట్సాప్‌లో వైరల్‌గా మారుతున్న తప్పుడు వార్తలు, మెసేజీలు పలు సందర్భాల్లో హింసకు దారి తీస్తున్న నేపథ్యంలో కేంద్రం దీనిపై ప్రత్యేకంగా

Most from this category