STOCKS

News


బెంజ్‌ నుంచి నూతన సీఎల్‌ఎస్‌ 300డి

Saturday 17th November 2018
auto-mobiles_main1542432753.png-22125

న్యూఢిల్లీ: జర్మనీ కార్ల తయారీ సంస్థ మెర్సెడెస్‌ బెంజ్‌ నూతనంగా సీఎల్‌ఎస్‌ 300డి మోడల్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.84.70 లక్షలు. కొత్త తరం ఈ సీఎల్‌ఎస్‌ మోడల్‌ కారు రెండు లీటర్ల బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన డీజిల్‌ ఇంజన్‌తో, 180కేవీ పవర్‌తో ఉంటుందని కంపెనీ తెలిపింది. తాజా విడుదల 2018లో కంపెనీ నుంచి 12వ ఉత్పత్తి అని మెర్సెడెస్‌ బెంజ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మైఖేల్‌ జాప్‌ అన్నారు. తమ ఉత్పత్తుల ఆవిష్కరణ 2019లోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మూడో తరం సీఎల్‌ఎస్‌ కారు మంచి విలాసంతో సౌకర్యాన్ని అందిస్తుందన్నారు. ఇందులో బర్మెస్టర్‌ సరౌండ్‌ సౌండ్‌ సిస్టమ్‌ (13 అధిక పనితీరుతో కూడిన స్పీకర్లు), ఇంటీరియర్‌ ప్రత్యేక అనుభవాన్ని ఇస్తాయని కంపెనీ పేర్కొంది. 



You may be interested

పార్శ్వనాధ్‌ డెవలపర్స్‌ నష్టాలు రూ.21 కోట్లు

Saturday 17th November 2018

న్యూఢిల్లీ: రియల్టీ కంపెనీ పార్శ్వనాధ్‌ డెవలపర్స్‌కు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.21 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.33 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పార్శ్వనాధ్‌ డెవలపర్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.23 కోట్ల నుంచి రూ.24 కోట్లకు తగ్గిందని కంపెనీ చైర్మన్‌ ప్రదీప్‌ జైన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారాయన.

మహీంద్రా ‘మారాజో’ ధరల పెంపు

Saturday 17th November 2018

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా ఇటీవలే విడుదల చేసిన ‘మారాజో’ బహుళ వినియోగ వాహనం ధరలను రూ.30,000-40,000 వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. వచ్చే జనవరి 1 నుంచి ఈ ధరల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. రూ.9.99 లక్షల నుంచి రూ.13.90 లక్షల ధరల శ్రేణితో మారాజోను ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహీంద్రా మార్కెట్లోకి విడుదల చేసింది. ‘‘ఇది పరిచయ ధర మాత్రమేనని విడుదల సందర్భంలో చెప్పాం. విడుదల చేసిన

Most from this category