STOCKS

News


మారుతీ కార్ల ధరలకు రెక్కలు

Thursday 6th December 2018
auto-mobiles_main1544075812.png-22692

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతోంది. ఉత్పత్తి వ్యయాలు పెరగడం, విదేశీ మారక ద్రవ్య రేట్లు కూడా పెరుగుతున్న  కారణంగా ధరలను పెంచక  తప్పడం లేదని మారుతీ సుజుకీ తెలిపింది. వచ్చే నెల నుంచి ధరలను పెంచుతున్నామని పేర్కొన్న  ఈ కంపెనీ ఎంత మేరకు ధరలను పెంచేది వెల్లడించలేదు. కమోడిటీ దరలు పెరుగుతున్నాయని, విదేశీ మారక ద్రవ్య రేట్లు కూడా పెరుగుతున్నాయని, ఫలితంగా ఉత్పత్తి వ్యయాలు అధికమవుతున్నాయని మారుతీ సుజుకీ తెలిపింది. ఈ భారాన్ని కొంత వినియోగదారులపై మోపక తప్పడం లేదని పేర్కొంది. అందుకే వివిధ మోడళ్ల కార్ల ధరలను జనవరి నుంచి పెంచుతున్నామని వివరించింది. 

ప్రస్తుతం ఈ కంపెనీ రూ.2.53 లక్షల ఖరీదుండే ఎంట్రీలెవల్‌ కారు ఆల్టో800 నుంచి రూ.11.45 లక్షల ధర గల ప్రీమియమ్‌ క్రాసోవర్‌ ఎస్‌-క్రాస్‌ వరకూ విభిన్న రకాల మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. 
అన్ని కంపెనీలదీ ‘పెంపు’ బాటే.....
పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు తట్టుకోలేక పలు వాహన కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. టయోట తన వాహనాల ధరలను 4 శాతం వరకూ, ఇసుజు మోటార్స్‌ కంపెనీ తన వాహనాల ధరలను రూ. లక్ష వరకూ పెంచుతున్నట్లు ప్రకటించాయి. 



You may be interested

ముంబై-పుణె మధ్య హెలికాప్టర్‌ సేవలు

Thursday 6th December 2018

ముంబై: యాప్‌తో నిమిషంలో క్యాబ్‌ బుక్‌ చేసుకున్నట్టే... త్వరలో హెలికాప్టర్‌ సర్వీస్‌ను ఇంతే సులభంగా ఆర్డర్‌ చేసే అవకాశం రానుంది. దేశంలో తొలిసారిగా రెండు నగరాల మధ్య హెలికాప్టర్‌ సేవలు ఆరంభం కానున్నాయి. అమెరికాలో అతిపెద్ద హెలికాప్టర్‌ సేవల సంస్థ అయిన ‘ఫ్లై బ్లేడ్‌’ ఇందుకు శ్రీకారం చుట్టింది. ఢిల్లీకి చెందిన హంచ్‌ వెంచర్స్‌ భాగస్వామ్యంతో కలసి ఈ సంస్థ ముంబై-పుణె నగరాల మధ్య హెలికాప్టర్‌ సర్వీసులను వచ్చే మార్చి

ఇన్‌ఫ్లయిట్ కనెక్టివిటీపై త్వరలో మార్గదర్శకాలు: మనోజ్ సిన్హా

Thursday 6th December 2018

న్యూఢిల్లీ: విమానప్రయాణంలో కూడా ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించే ఇన్‌-ఫ్లయిట్ కనెక్టివిటీపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. న్యాయ శాఖ అనుమతులు లభించిన పక్షంలో జనవరిలోనే నిబంధనలను ప్రకటించే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. "ప్రస్తుతం న్యాయ శాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. వారం, పది రోజుల్లో లభించే అవకాశాలు ఉన్నాయి. అనుమతులు వచ్చాకా.. ప్రక్రియ

Most from this category