STOCKS

News


మార్కెట్లోకి మారుతీ స్విఫ్ట్‌ ఏజీఎస్‌ వేరియంట్‌

Thursday 9th August 2018
auto-mobiles_main1533793010.png-19087

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ స్విఫ్ట్‌కి చెందిన హై ఎండ్‌ మోడళ్లలో ఆటో గేర్‌ షిఫ్ట్‌ (ఏజీఎస్‌) సౌకర్యమున్న కార్లను మార్కెట్లోకి తెచ్చింది. దీంట్లో పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.7.76 లక్షలని, డీజిల్‌ వేరియంట్‌ ధర రూ.8.76 లక్షలని (రెండు ధరలూ ఎక్స్‌ షోరూమ్‌, ఢిల్లీ) మారుతీ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త స్విఫ్ట్‌ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చామని పేర్కొంది. అప్పుడే స్విఫ్ట్‌కు చెందిన వీఎక్స్‌ఐ, జడ్‌ఎక్స్‌ఐ, వీడీఐ, జడ్‌డీఐ వేరియంట్లలో ఏజీఎస్‌ ట్రాన్సిమిషన్‌ సౌకర్యాన్ని అందించామని తెలిపింది. ఇప్పుడు తాజాగా స్విఫ్ట్‌ హై ఎండ్‌ మోడళ్లు-జడ్‌ఎక్స్‌ఐ ప్లస్‌, జడ్‌డీఐప్లస్‌ వేరియంట్లలో కూడా ఈ ఏజీఎస్‌   ఫీచర్‌ను అందిస్తున్నామని తెలిపింది. దీంతో స్విఫ్ట్‌ బ్రాండ్‌ మరింత పటిష్టమవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. మారుతీ కంపెనీ స్విఫ్ట్‌ను 2005లో మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటిదాకా 19 లక్షల స్విఫ్ట్‌ కార్లను విక్రయించింది.



You may be interested

నెల రోజుల కోసం బొనాంజా సిఫార్సులు

Thursday 9th August 2018

వచ్చే 30 రోజుల్లో 11 శాతం వరకు రాబడినిచ్చే 3 స్టాకులను బొనాంజా పోర్టుఫోలియో రికమండ్‌ చేస్తోంది. 1. అజంతా ఫార్మా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1295. స్టాప్‌లాస్‌ రూ. 1127. డైలీ చార్టుల్లో ఇంతవరకు పయనిస్తూ వచ్చిన రేంజ్‌బౌండ్‌ పాటర్న్‌కు పైన క్లోజయింది. ధర పెరగడంతో పాటు వాల్యూంలు కూడా బాగా పెరిగి కౌంటర్లో ఉత్సాహాన్ని నింపాయి. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచి అప్‌మూవ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. 2. చోళమండలమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌:

లుపిన్‌ లాభం 43 శాతం డౌన్‌

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ లుపిన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో రూ.203 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో సాధించిన నికర లాభం, రూ.358 కోట్లతో పోలిస్తే 43 శాతం క్షీణత నమోదైందని లుపిన్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.2,807 కోట్ల నుంచి రూ.3,775 కోట్లకు తగ్గిందని లుపిన్‌ ఎండీ, నీలేశ్‌ గుప్తా తెలియజేశారు. అమెరికా, జపాన్‌ మార్కెట్లలో కంపెనీ పనితీరు అంతంతమాత్రంగానే ఉండటంతో

Most from this category