STOCKS

News


ప్యాసింజర్‌ విభాగంలో మారుతీ ఆధిపత్యం

Tuesday 10th July 2018
auto-mobiles_main1531239353.png-18182

న్యూఢిల్లీ: దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’.. దేశీ ప్యాసెంజర్‌ వాహన విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) 52.54 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. టాటా మోటార్స్‌ మార్కెట్‌ వాటా పరంగా హోండా కార్స్‌ను వెనక్కునెట్టి నాల్గో స్థానాన్ని దక్కించుకుంది. ఆటోమొబైల్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ సమాఖ్య (సియామ్‌) ప్రకారం.. ఏప్రిల్‌- జూన్‌ మధ్యకాలంలో మొత్తం దేశీ ప్యాసెంజర్‌ వాహన అమ్మకాలు 19.91 శాతం వృద్ధితో 7,28,483 యూనిట్ల నుంచి 8,73,501 యూనిట్లకు పెరిగాయి. మారుతీ విక్రయాలు 24.93 శాతం వృద్ధితో 4,58,967 యూనిట్లకు ఎగశాయి. మార్కెట్‌ వాటా 50.43 శాతం నుంచి 52.54 శాతానికి చేరింది. దీంతో ఇది అగ్రస్థానంలో నిలిచింది. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా అమ్మకాలు 10.28 శాతం వృద్ధితో 1,37,114 యూనిట్లకు పెరిగినా.. మార్కెట్‌ వాటా మాత్రం 17 శాతం నుంచి 15.69 శాతానికి తగ్గింది. దీంతో ఇది రెండో స్థానంలోనే ఉంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాలు 60,539 యూనిట్లుగా నమోదయ్యాయి. విక్రయాల్లో 8.52 శాతం వృద్ధి కనిపించినా.. మార్కెట్‌ వాటా మాత్రం 7.65 శాతం నుంచి 6.93 శాతానికి క్షీణించింది. దీంతో ఇది మూడో స్థానంలో నిలిచింది. టాటా మోటార్స్‌ విక్రయాల్లో ఏకంగా 48.5 శాతం వృద్ధి నమోదయ్యింది. అమ్మకాలు 39,708 యూనిట్ల నుంచి 58,969 యూనిట్లకు పెరిగాయి. సంస్థ మార్కెట్‌ వాటా 5.45 శాతం నుంచి 6.75 శాతానికి ఎగసింది. దీంతో టాటా మోటార్స్‌.. హోండా కార్స్‌ను వెనక్కునెట్టి నాల్గో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక హోండా కార్స్‌ అమ్మకాలు 42,609 యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్‌ వాటా 5.29 శాతం నుంచి 4.88 శాతానికి తగ్గింది. 



You may be interested

రోడ్లపై కార్ల జోరు!

Tuesday 10th July 2018

 జూన్‌లో వాహన విక్రయాలు 38% జంప్‌  2,73,759 యూనిట్లుగా నమోదు  పదేళ్లలో ఇదే అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి  సియామ్‌ గణాంకాల్లో వెల్లడి న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ జోరుమీదుంది. జూన్‌ నెలలో ప్యాసింజర్‌ వాహన అమ్మకాల్లో 38 శాతం వృద్ధి నమోదయ్యింది. అటుఇటుగా గత పదేళ్లలో ఇదే అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి. ఆటోమొబైల్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ సమాఖ్య (సియామ్‌) తాజా గణాంకాల ప్రకారం..  ♦ దేశీ ప్యాసింజర్‌ వాహన (పీవీ) అమ్మకాలు 1,99,036 యూనిట్ల నుంచి

భార్య, కుమార్తెలకు బహమతులపై పన్ను వద్దు

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ: భార్య, కుమార్తెలకు ఇచ్చే బహుమతులపై గిఫ్ట్‌ ట్యాక్స్‌ వేయవద్దని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖా మంత్రి మేనకాగాంధీ కోరారు. ఇందుకు సంబంధించి చట్ట సవరణలు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌కు సూచించారు. ‘‘ఓ సమాజంగా మహిళల ఆర్థిక సాధికారతకు భరోసానివ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 64ను తగిన విధంగా సవరించడాన్ని పరిశీలించాలని ఆర్థిక మంత్రిని కోరుతున్నాను’’ అని

Most from this category