STOCKS

News


టాప్‌ గేర్‌లో మారుతీ డిజైర్‌

Tuesday 9th October 2018
auto-mobiles_main1539059174.png-20953

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ఏడాదిన్నర కిందట విడుదల చేసిన డిజైర్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ అమ్మకాల్లో మరో మైలురాయిని అధిగమించింది. సరిగ్గా 17 నెలల కిందట మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ సబ్‌ కాంపాక్ట్‌ సెడాన్‌ కారు అమ్మకాలు 3 లక్షలు మించినట్లు కంపెనీ ప్రకటించింది. గతేడాది మే నెలలో మూడవ జనరేషన్‌ డిజైర్‌గా మార్కెట్‌లో విడుదలైన ఈ కారు.. అంతకుముందు వెర్షన్‌ కంటే 28 శాతం అధిక అమ్మకాలతో దూసుకుపోతున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెటింగ్, సేల్స్‌) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. మొత్తం సేల్స్‌లో 25 శాతం అమ్మకాలు నూతన ఫీచర్లు కలిగిన హైఎండ్‌ కార్లు కాగా.. దాదాపు 20 శాతం అమ్మకాలు ఆటోమేటిక్‌ వేరియంట్‌వి ఉన్నట్లు వెల్లడించారు.You may be interested

రేట్ల తగ్గింపు ప్రతికూలమే

Tuesday 9th October 2018

హైదరాబాద్‌: పెట్రోల్, డీజిల్ రేట్లను రూ. 2.50 మేర తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చమురు మార్కెటింగ్‌ కంపెనీల (ఓఎంసీ) మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సోమవారం తెలిపింది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగంలోని మూడు సంస్థల (ఐవోసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌) మొత్తం ఎబిటా మార్జిన్లు రూ.6,500 కోట్ల మేర తగ్గే అవకాశం ఉందని వివరించింది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో వాటి

ఫ్లిప్‌కార్ట్‌లో 30,000 నియామకాలు

Tuesday 9th October 2018

 పండుగల అమ్మకాల కోసం 30,000 మంది సీజనల్‌ ఉద్యోగులను నియమించుకున్నట్లు ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 10-14 సమయంలో జరుగనున్న ఐదవ ఎడిషన్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ ఆఫర్‌ ద్వారా పరోక్షంగా 5 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నట్లు వెల్లడించింది. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఉద్యోగ కల్పనలో భాగంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. మరోవైపు పోటీసంస్థ అమేజాన్‌ పండుగల

Most from this category