STOCKS

News


టాప్‌ గేర్‌లో మారుతి సియాజ్

Thursday 11th October 2018
auto-mobiles_main1539231612.png-21031

న్యూఢిల్లీ: ప్రీమియం సెడాన్‌ విభాగంలో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) సియాజ్ టాప్‌ గేర్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి అర్థభాగంలో 24,000 కార్ల విక్రయం నమోదైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ క్యాటగిరీలో 28.8 శాతం మార్కెట్‌ వాటాను కలిగిఉన్నట్లు సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్. కల్సీ వెల్లడించారు. 2014లో విడుదలైన సెడాన్‌.. ఇప్పటివరకు 2.34 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. ఆగస్టులో విడుదలైన వెర్షన్‌ బుకింగ్స్‌ 10,000గా ఉన్నట్లు వ్యాఖ్యానించారు.



You may be interested

అధునాతన ‘డాట్సన్ గో, గో ప్లస్’ కార్లు విడుదల

Thursday 11th October 2018

చెన్నై: జపనీస్‌ ఆటోమేకర్‌ నిస్సాన్‌.. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని  ‘డాట్సన్ గో, గో ప్లస్’  కార్లలో కొత్త వేరియంట్లను మంగళవారం భారత మార్కెట్‌లో విడుదలచేసింది. దాదాపు 100కు పైగా అప్‌డేట్స్‌, 28 నూతన ఫీచర్లు ఈ వేరియంట్లలో ఉన్నట్లు ప్రకటించింది. గో బ్రాండ్‌ ధర రూ.3.29 లక్షలు కాగా, గో ప్లస్ ధర రూ.3.83 లక్షలుగా వెల్లడించింది. ఈ సందర్భంగా నిస్సాన్‌ ఇండియా మోటార్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌)

టాటా 'టిగోర్‌' విడుదల

Thursday 11th October 2018

న్యూఢిల్లీ: కాంపాక్ట్‌ సెడాన్‌ కారు టిగోర్‌ అధునాతన వెర్షన్‌ను టాటా మోటార్స్‌ మంగళవారం విడుదల చేసింది. పెట్రోల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.5.20లక్షలు–6.65 లక్షలు కాగా, ఇందులో 1.2 లీటర్ల ఇంజిన్‌ అమర్చినట్లు కంపెనీ ప్రకటించింది. డీజిల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.6.09 లక్షలు–7.38 లక్షలుగా నిర్ణయించామని, 1.05 లీటర్ల ఇంజిన్‌తో ఈ సెడాన్‌ అందుబాటులో ఉంటుందని టాటా మోటార్స్‌ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గుంటెర్‌ బుషెక్‌ వెల్లడించారు. ఈ

Most from this category