STOCKS

News


వాణిజ్య వాహనాలపై ఇంధన ధరల ప్రభావం

Saturday 13th October 2018
auto-mobiles_main1539410526.png-21121

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వర్షాభావం, ఇంధన ధరల పెరుగుదల వాణిజ్య వాహనాల మీద ప్రభావం ఉంటుందని.. దీంతో అమ్మకాలు కాస్త నెమ్మదించే అవకాశముందని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌) మహేశ్‌ కులకర్ణి చెప్పారు. దేశంలో ఏటా 2.20 లక్షల పికప్‌ వాహనాలు విక్రయమవుతున్నాయని.. వీటిల్లో మహీంద్రా వాటా 62 శాతం వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ఏటా మహీంద్రా నుంచి 12 వేల వాహనాలను విక్రయిస్తున్నామని చెప్పారు. 60 శాతం అమ్మకాలు వ్యవసాయ, సర్వీసెస్‌ విభాగం నుంచి ఉంటాయని తెలిపారు. ‘మహా బొలెరో’ వాహనాన్ని శుక్రవారమిక్కడ విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మహీంద్రా వాణిజ్య వాహనాల మొత్తం అమ్మకాల్లో 28 శాతం బొలెరో వాటా ఉంటుందని.. ఏటా ఈ వాహనాల అమ్మకాల వృద్ధి 12 శాతం వరకు ఉంటోందని తెలిపారు. గతేడాది 1.49 లక్షల వాహనాలను విక్రయించామన్నారు. నెలకు దేశంలో 12 వేల వాహనాలను విక్రయిస్తే.. ఎగుమతుల వాటా 800 వరకు ఉంటుందని చెప్పారు.
విపణిలోకి మహా బొలెరో..
వాణిజ్య వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా తాజాగా విపణిలోకి మహా బొలెరో పికప్‌ వాహనాన్ని విడుదల చేసింది. 1.3 నుంచి 1.7 టన్నుల వరకు 3 రకాల వాహనాలు అందుబాటులో ఉంటాయి. వీటి ధరలు రూ.6.68 లక్షల నుంచి రూ.6.90 లక్షల మధ్య ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జోనల్‌ సౌత్‌ హెడ్‌ మనోజ్‌ కుమార్‌ గుప్తా పాల్గొన్నారు.



You may be interested

హైదరాబాద్‌లో కొటక్‌ మొబైల్‌ మెడికల్‌ వ్యాన్లు

Saturday 13th October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కార్పొరేట్ల సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యక్రమంలో భాగంగా కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ హైదరాబాద్‌లో మొబైల్‌ మెడికల్‌ వ్యాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి నిర్వహణ కోసం వోకార్డ్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ జాయింట్‌ ఎండీ దీపక్‌ గుప్తా శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 6 మొబైల్‌ వ్యాన్లు అందుబాటులో ఉంటాయని... స్థానిక నివాసితులకు వైద్య సేవలను అందిస్తుందని తెలిపారు.

కర్నాటక బ్యాంక్‌ లాభం 20 శాతం అప్‌

Saturday 13th October 2018

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని కర్నాటక బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 20 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.93 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.112 కోట్లకు పెరిగిందని కర్నాటక బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు తక్కువగా ఉండటం, కీలక ఆదాయం బాగా ఉండటం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కర్నాటక బ్యాంక్‌​ ఎమ్‌డీ,

Most from this category