STOCKS

News


లగ్జరీ కార్లు రయ్‌.. రయ్‌..

Saturday 14th July 2018
auto-mobiles_main1531552663.png-18315

  • జనవరి-జూన్‌లో 20,000 యూనిట్ల విక్రయాలు

లగ్జరీ కార్ల విక్రయాలు జోరుమీదున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 20,000 యూనిట్లుగా నమోదయ్యాయి. సగటున 12-13 శాతం వృద్ధి రేటు కనిపించింది. 2017లో మొత్తం అమ్మకాలు 39,000గా ఉన్నాయి. కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ, డీలర్‌ నెట్‌వర్క్‌ విస్తరణ, కస్టమర్ల డిమాండ్‌ వంటి పలు అంశాలు విక్రయాల పెరుగుదలకు కారణం. లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు జనవరి నుంచి రెండంకెల వృద్ధిని నమోదుచేస్తూ వస్తున్నాయి. మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ అమ్మకాలు వరుసగా 12 శాతం, 13 శాతం వృద్ధి చెందాయి. జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ విక్రయాల్లో ఏకంగా 66 శాతం వృద్ధి కనిపించింది. ఇక వోల్వో అమ్మకాలు 33 శాతం పెరిగాయి. 2018 జనవరి-జూన్‌ విక్రయాలే ఈ నాలుగు కంపెనీలకు భారత్‌లో ఇప్పటిదాకా అత్యుత్తమ గణాంకాలు కావడం గమనార్హం. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో బలమైన అమ్మకాలు సాధించామని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోనాల్డ్‌ ఫోల్గర్‌ తెలిపారు. కొత్తగా, ఇన్నోవేటివ్‌గా ప్రొడక్టుల ఆవిష్కరణ అనే కంపెనీ వ్యూహాలు ఇప్పుడు ఫలితానిస్తున్నాయని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ పేర్కొన్నారు. బీఎండబ్ల్యూ 6 సిరీస్‌ గ్రాన్‌ టురిస్మో, బీఎండబ్ల్యూ ఎక్స్‌3 వంటి మోడళ్లు తమ అంచనాలకు మించి ఆదరణ పొందుతున్నాయని తెలిపారు. తమ వ్యూహాల్లో యూరో-6 ప్రమాణాలకు అనువైన ఇంజిన్ల ఆవిష్కరణ కూడా కీలక పాత్ర పోషించిందన్నారు. కాగా లగ్జరీ కార్‌ మార్కెట్‌కి గత కొన్నేళ్లలో పలు సవాళ్ల ఎదురయ్యాయి. అధిక సామర్థ్యమున్న డీజిల్‌ ఇంజిన్లపై ఢిల్లీలో నిషేధం విధించడం, డీమోనిటైజేషన్‌, జీఎస్‌టీ, సుంకం పెంపు వంటి సమస్యలను ఎదుర్కొంది.   

 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఐపీఓకు సెబీ ఓకే..!

Saturday 14th July 2018

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ 3,000-3,500 కోట్ల సమీకరణకు సిద్ధమైంది. ప్రైస్‌బ్యాండ్‌ రూ.1,200-1,500ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఐపీఓలో భాగంగా 2.54 కోట్ల షేర్లను జారీ చేయనుంది. వీటిలో 3.20 లక్షల షేర్లను సంస్థ ఉద్యోగులకు, 24 లక్షల షేర్లను హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ హోల్డర్లకు కేటాయించారు. మిగతా మొత్తం

క్యూ1లో పెరిగిన పాలసీ ప్రీమియంలు

Saturday 14th July 2018

ముంబై:- జీవిత బీమా సంస్థల కొత్త ప్రీమియం కలెక్షన్లు జూన్‌ క్వార్టర్‌లో రెండెంకెల వృద్ధిని నమోదు చేశాయి. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏఐ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీవిత బీమా సంస్థలు మొత్తం ప్రీమియం కలెక్షన్లు 11 శాతం వృద్ధితో రూ.33,166 కోట్లను నమోదు చేశాయి. గతేడాది ఇదే క్వార్టర్లో మొత్తం వసూళ్లు రూ.33,156కోట్లగా ఉన్నాయి. ఇదే క్యూ1లో ప్రభుత్వ రంగ

Most from this category