STOCKS

News


లావా నుంచి ఫోటోగ్రఫీ స్మార్ట్‌ఫోన్‌ జెడ్‌81

Tuesday 20th November 2018
auto-mobiles_main1542684146.png-22199

న్యూఢిల్లీ: దేశీయ మొబైల్స్‌ తయారీ బ్రాండ్‌ లావా ‘జెడ్‌81’ పేరుతో ఫొటోగ్రఫీ ప్రియుల కోసం స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. స్టూడియో ఫొటోగ్రఫీ అనుభవాన్నిస్తుందని, ఇందులోని ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతిక వల్ల అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది. డీఎస్‌ఎల్‌ఆర్‌ ‍స్ల్పాష్‌ మోడ్‌ ఆప్షన్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫొటోగ్రఫీలో ఓ విప్లవంగా అభివర్ణించింది. ముందు, వెనుక 13 మెగా పిక్సల్స్‌ కెమెరాలు ఉంటాయని, ఈ రెండింటికీ డీఎస్‌ఎల్‌ఆర్‌ స్లా‍్పష్‌ మోడ్‌ ఉంటుందని కంపెనీ తెలిపింది. 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఒక్కసారి చార్జింగ్‌తో, మోస్తరు వినియోగంలో రోజున్నర పాటు పనిచేస్తుందని పేర్కొంది. ఇందులో 2జీబీ, 3జీ ర్యామ్‌తో రెండు వేరియంట్లు ఉంటాయి. కంపెనీ ప్రస్తుతం 3జీ వేరియంట్‌ను విడుదల చేయగా, త్వరలోనే 2జీబీ రకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. 3జీబీ రకం ధర రూ.9,499. ఆండ్రాయిడ్‌ 8.1ప్లస్‌ ఓఎస్‌పై పనిచేస్తుంది. 5.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌, 2 గిగాహెర్జ్‌ క్వాడ్‌కోర్‌ హీలియో ఏ22 ప్రాసెసర్‌, ఎస్‌ఎంఎస్‌లను 15 భారతీయ భాషల్లో చదివే ఆప్షన్‌ ఉన్నాయి. 

 
 



You may be interested

స్విస్‌ వాచీల హైటెక్‌ రూటు!!

Tuesday 20th November 2018

లగ్జరీకి, ఖచ్చితత్వానికి స్విట్జర్లాండ్‌ (స్విస్‌)వాచీలు పెట్టింది పేరు. శతాబ్దాలుగా అనేక సవాళ్లను అధిగమిస్తూ దిగ్గజాలుగా ఎదిగిన స్విస్‌ వాచీ సంస్థలకు ప్రస్తుతం టెక్‌ దిగ్గజం యాపిల్‌ స్మార్ట్‌వాచీల రూపంలో మరో సవాలు ఎదురైంది. ప్రారంభంలో వీటిని పెద్దగా పట్టించుకోకపోయినా.. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా స్మార్ట్‌వాచీల తయారీపై స్విస్‌ దిగ్గజాలు కూడా దృష్టి పెడుతున్నాయి. వినూత్న స్మార్ట్, హైబ్రీడ్‌ వాచీలను రూపొందిస్తున్నాయి. సాంప్రదాయ వాచీలకు హైటెక్‌ హంగులు అద్దుతున్నాయి. ఇందుకోసం

యస్ బ్యాంక్ బోర్డుకు చంద్రశేఖర్ రాజీనామా..

Tuesday 20th November 2018

న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ బోర్డు నుంచి మరొక సభ్యుడు నిష్క్రమించారు. వ్యక్తిగత కారణాలతో స్వతంత్ర డైరెక్టర్‌ రెంటాల చంద్రశేఖర్ సోమవారం రాజీనామా చేసినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు సంస్థ తెలిపింది. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి అశోక్ చావ్లా, బోర్డులో సభ్యత్వం నుంచి ఎస్‌బీఐ మాజీ చైర్మన్ ఓపీ భట్‌ ఇటీవలే తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు, బోర్డును పునర్‌వ్యవస్థీకరించాలని బ్యాంకు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు

Most from this category