News


భారత్‌ టాప్‌ 10 లక్ష్యం దిశగా లంబోర్గిని..!

Friday 28th September 2018
auto-mobiles_main1538109480.png-20663

పూణే: ఇటలీకి చెందిన లగ్జరీ కార్‌ మేకర్‌ లంబోర్గిని భారత మార్కెట్‌పై దృష్టిసారించింది. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా ఇక్కడ సూపర్‌ స్పోర్ట్స్‌ కార్ల మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోందని వెల్లడించిన ఈ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సంస్థ.. విక్రయాల పరంగా అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్‌ టాప్‌ 10 దేశాల జాబితాలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. ఇటీవలే విడుదలైన ‘యూరస్‌’ సూపర్‌ ఎస్‌యూవీ డెలివరీలు కొనసాగుతున్నాయని, సగటు వెయిటింగ్‌ పిరియడ్‌ 6-9 నెలలు ఉండగా.. భారత్‌లో కారు ధర 3.1 కోట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఈ కారు విడుదల అనంతరం భారత మార్కెట్‌లో పట్టుపెరుగుతోందని ప్రకటించింది. ఈ అంశంపై లంబోర్గిని ఆసియా పసిఫిక్ సీఈఓ మాట్టియో ఓర్టెన్జీ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు భారత్‌ టాప్‌ 10 అమ్మకాల జాబితాలోకి ఇంకా చేరలేదు. అయితే.. వేగంగా కొనసాగుతున్న మౌళిక సదుపాయాల నిర్మాణం, వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఆధారంగా సూపర్‌ స్పోర్ట్స్‌ కార్ల మార్కెట్‌ పెరుగుతుందని భావిస్తున్నాం. వచ్చే 5 ఏళ్లలో భారత్‌ టాప్‌ టెన్‌ జాబితాలో ఉండనుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నాం.’ అని వ్యాఖ్యానించారు. 



You may be interested

ఆహార శుద్ధి రంగంలోకి మరిన్ని ఎఫ్‌డీఐలు!

Friday 28th September 2018

ముంబై: ఆహార శుద్ధి రంగానికి ఊతమిచ్చేందుకు గాను మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను ఆకర్షించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఈ రంగానికి సంబంధించి ఎఫ్‌డీఐ నియంత్రణలను సరళీకరించనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ రాజీవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఫిక్కీ నిర్వహిస్తున్న మూడు రోజుల ‘వరల్డ్‌ ఆఫ్‌ ఫుడ్‌ ఇండియా’ సదస్సు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పటికే 8.7 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు ఆహార శుద్ధి రంగంలోకి వచ్చాయి.

హెచ్‌పీసీఎల్ బంకుల్లో చార్జింగ్ స్టేషన్లు

Friday 28th September 2018

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి వాణిజ్య ప్రాతిపదికన చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్తాన్ పెట్రోలియంతో (హెచ్‌పీసీఎల్‌) టాటా పవర్ జట్టు కట్టింది. హెచ్‌పీసీఎల్‌ రిటైల్ అవుట్‌లెట్స్‌తో పాటు దేశవ్యాప్తంగా ఇతరత్రా ప్రాంతాల్లో కూడా ఈవీ చార్జింగ్ స్టేషన్స్‌ను ప్రారంభించేందుకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయని టాటా పవర్ వెల్లడించింది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ కార్లు, రిక్షాలు, బైక్‌లు,

Most from this category