ప్రతీ ఆరు నెలలకో కొత్త మోడల్
By Sakshi

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా వాహన దిగ్గజ కంపెనీ కియా మోటార్స్ వచ్చే ఏడాది జూన్ నుంచి భారత్‌లో వాహనాలను విక్రయించనుంది. ప్రతి ఆరు నెలలకూ ఒక కొత్త మోడల్ చొప్పున మూడేళ్లలో ఆరు కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తెస్తామని కియా మోటార్స్ ఇండియా సీఈఓ, ఎండీ కుక్యున్ షిమ్ తెలిపారు అమ్మకాలు అధికంగా ఉండే కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్‌కు ప్రస్తుతం పెద్ద ప్రాధాన్యమివ్వటం లేదన్నారు. మూడేళ్లలో అగ్రశ్రేణి అయిదు కంపెనీల్లో ఒకటిగా నిలవడం లక్ష్యమని చెప్పారు. ‘‘మాస్ సెగ్మెంట్లో ప్రీమియమ్ బ్రాండ్‌గా నిలవాలనుకుంటున్నాం. ప్రస్తుతం మేం ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో వాహనాలను విక్రయిస్తున్నాం. అపారమైన అనుభవం ఉంది. భారత్‌లో కాంపాక్ట్ కార్లు లేకుండా టాప్-5 కంపెనీల్లో ఒకటిగా నిలవటమనేది దాదాపు అసాధ్యం. కానీ మా అనుభవం ఆధారంగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. అమ్మకాల తోడ్పాటు కోసం, అవసరమైనప్పుడు, కాంపాక్ట్ కార్లను కూడా రంగంలోకి దింపుతాం’’ అని షిమ్ తెలియజేశారు.
ఎస్సీ కాన్సెప్ట్ ఎస్‌యూవీతో ఆరంభం....
ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఎస్యూవీ, ఎస్పీ కాన్సెప్ట్‌తో భారత్‌లో అమ్మకాలు ఆరంభిస్తామని షిమ్ తెలిపారు. భారత వినయోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ కారును తయారు చేస్తున్నామని చెప్పారు. ‘‘ఈ కారు చక్కని అమ్మకాలు సాధిస్తుందన్న ధీమా ఉంది. భవిష్యత్తులో కూడా వినియోగదారుల అభిరుచులు, అవసరాలకనుగుణంగానే వాహనాలను అందిస్తాం. భారత వాహన మార్కెట్ చాలా భిన్నమైనది. ప్రతి సెగ్మెంట్లోనూ విభిన్న రకాలైన వాహనాలు అవసరం’’ అని చెప్పారాయన. కియా మోటార్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో 110 కోట్ల డాలర్ల పెట్టుబడులతో ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ వార్షిక వాహన ఉత్పత్తి సామర్థ్యం మూడు లక్షలు.
You may be interested
ఇసుజు మోటార్స్ ధరలు పెరుగుతాయ్
Wednesday 5th December 2018ముంబై: జపాన్‌కు చెందిన ఇసుజు మోటార్స్ కంపెనీ భారత్‌లో విక్రయించే తన వాహనాల ధరలను రూ.లక్ష వరకూ పెంచుతోంది. పెంచిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని ఇసుజు మోటార్స్ తెలియజేసింది. ఉత్పత్తి, పంపిణి వ్యయాలు పెరిగిపోవడంతో ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొంది. వాణిజ్య వాహనాల ధరలను 1-2 శాతం రేంజ్లో, లైఫ్‌స్టైల్, అడ్వైంచర్ పిక్-అప్ వాహనాల ధరలను 3-4 శాతం రేంజ్లో పెంచనున్నామని వెల్లడించింది.
ద్రవ్యోల్బణం డేటాను ఆధునీకరించాలి
Wednesday 5th December 2018న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం గణాంకాల కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని సత్వరమే ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ ఎంపీసీ సభ్యుడు రవీంద్ర ధోలకియా అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ మూడు రోజుల పాలసీ భేటీ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ద్రవ్యోల్బణం డేటాపై ధోలకియా ప్రశ్నలు లేవనెత్తారు. ద్రవ్యోల్బణం లెక్కింపునకు సరైన విధానం లేకుండా... ద్రవ్యోల్బణాన్ని లక్ష్యిత పరిధిలోనే ఉంచాలన్న కార్యాచరణను ఆర్బీఐ అనుసరించడాన్ని ప్రశ్నించారు. ఫిక్స్డ్ బేస్ వెయిట్ ఇండెక్స్