STOCKS

News


జేఎల్‌ఆర్‌ ‘2019 డిస్కవరీ స్పోర్ట్‌’ విడుదల

Wednesday 12th December 2018
auto-mobiles_main1544591834.png-22849

 న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఇండియా (జేఎల్‌ఆర్‌).. ‘2019 డిస్కవరీ స్పోర్ట్‌’ పేరుతో నూతన వేరియంట్‌ ఎస్‌యూవీని మంగళవారం విడుదలచేసింది. నూతన ఫీచర్లు, 2.0 లీటర్ల ఇంజినియం డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ కారు ధర రూ.44.68 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సూరీ మాట్లాడుతూ.. ‘మెరుగైన పవర్‌ట్రైన్ ఆప్షన్‌ ఉండడం వల్ల కారు సామర్థ్యం మరింత పెరిగింది. విస్తృత శ్రేణి ఎస్‌యూవీని కస్టమర్లకు అందిస్తున్నాం. ఈ నూతన వేరియంట్‌తో జేఎల్‌ఆర్‌ పోర్టిఫోలియోలోని నూతన మోడల్స్‌ పెరిగాయి.’ అని వ్యాఖ్యానించారు. 



You may be interested

భారత్‌లో 38 శాతం బ్రిటన్‌ కంపెనీల పెట్టుబడులు

Wednesday 12th December 2018

న్యూఢిల్లీ: బ్రిటన్‌ కంపెనీల్లో 38 శాతం 2017లో భారత్‌లో కొత్తగా పెట్టుబడులు పెట్టాయి. 2016-18 మధ్య ప్రైవేటు రంగంలో 51,118 ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. అంతకుముందు 18 నెలల కాలంతో పోలిస్తే ఇది 14 శాతం అధికమని ‘స్టెర్లింగ్‌ అసెట్స్‌-బ్రిటన్‌ మీట్స్‌ ఇండియా’ నివేదిక తెలియజేసింది. భారత్‌లో బ్రిటన్‌ తన పెట్టుబడులను ఇతోధికం చేయడం ద్వారా అతిపెద్ద పాశ్చాత్య ఇన్వెస్టర్‌గా నిలిచినట్టు పేర్కొంది. బ్రిటన్‌ కంపెనీలు భారత్‌లో గత శతాబ్దకాలంలో

ఆర్‌బీఐ ఏ ఒక్కరిపైనో ఆధారపడి లేదు

Wednesday 12th December 2018

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ సంస్థాగత సామర్ధ్యాలు చాలా పటిష్టమైనవని, మార్కెట్లు.. ఎకానమీని చక్కదిద్దేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకోగలదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్  రాజీవ్ కుమార్ చెప్పారు. ఆర్‌బీఐ ఏ ఒక్కరిపైనో ఆధారపడి పనిచేయదని తెలిపారు. ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన నేపథ్యంలో రాజీవ్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. "గత రెండేళ్లుగా ఉర్జిత్ పటేల్ అద్భుతంగా పనిచేశారు. అయితే, ఆర్‌బీఐ ఏ ఒక్కరిపైనో ఆధారపడి

Most from this category