STOCKS

News


జేఎల్‌ఆర్‌ అమ్మకాలు 5 శాతం డౌన్‌

Saturday 8th September 2018
auto-mobiles_main1536381702.png-20088

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) అంతర్జాతీయ అమ్మకాలు గత నెలలో 5 శాతం తగ్గాయి. గత నెలలో జేఎల్‌ఆర్‌ వాహన విక్రయాలు 5 శాతం క్షీణించి  36,629కు తగ్గాయని జేఎల్‌ఆర్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ ఫెలిక్స్‌ వెల్లడించారు. జాగ్వార్‌ బ్రాండ్‌ అమ్మకాలు 8 శాతం వృద్ధితో 11,802కు పెరగ్గా, ల్యాండ్‌ రోవర్‌ బ్రాండ్‌ విక్రయాలు 10 శాతం పతనమై 24,827కు చేరాయని వివరించారు. కీలకమైన మార్కెట్లలో సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఇది అమ్మకాలపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. చైనాలో టారిఫ్‌ మార్పులు, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా అమ్మకాల్లో అనిశ్చితి నెలకొన్నదని వివరించారు. గత నెలలో ఇంగ్లాండ్‌లో అమ్మకాలు బాగానే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే డీజిల్‌ సంబంధిత నిబంధనలు, బ్రెగ్జిట్‌ అంశాలు.. యూరప్‌, ఇంగ్లాండ్‌ అమ్మకాలపై ప్రభావం చూపడం కొనసాగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. 



You may be interested

టీ–రెరాలో నమోదైన తొలి ప్రాజెక్ట్‌.. రాజక్షేత్ర!

Saturday 8th September 2018

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) వెబ్‌సైట్‌ ప్రారంభమైంది. టీ–రెరాలో నమోదైన తొలి ప్రాజెక్ట్‌గా రాజక్షేత్ర నిలిచింది. ఏ వ్యాపారంలోనైనా కస్టమరే రాజు. అలాంటి రాజులకు రాజసంలా నిలిచే రాజక్షేత్ర.. రెరాలో మొదటి ప్రాజెక్ట్‌గా నమోదవ్వటం ఆనందంగా ఉందన్నారు రాజక్షేత్రను నిర్మిస్తున్న గిరిధారి హోమ్స్‌ ఎండీ ఇంద్రసేనా రెడ్డి. కిస్మత్‌పూర్‌లో నిర్మిస్తున్న ఆర్ట్‌ ప్రాజెక్ట్‌ను కూడా త్వరలోనే రెరాలో నమోదు చేయనున్నామని చెప్పారు. 2017, జనవరి 1

ప్రజా రవాణాను విద్యుత్‌తో నడిపిస్తారా...?

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: ప్రజా రవాణా బస్సులను విద్యుత్‌తో నడిపించేందుకు ఇన్వెస్టర్లు ముందుకు వస్తే వారికి అన్ని రకాల అనుమతులను పళ్లెంలో పెట్టి అందిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు నియంత్రణ పరమైన అవరోధాలను తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనుమతులు చాలా పెద్ద అవరోధంగా మారి, ప్రాజెక్టుల వ్యయం పెరిగిపోయేందుకు దారితీస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మూవ్‌ సదస్సులో మాట్లాడుతూ... ప్రభుత్వరంగ రవాణా కార్పొరేషన్లు భారీ

Most from this category