STOCKS

News


వచ్చే నెల 15న ‘జావా’ మోటార్ సైకిల్ రీఎంట్రీ

Friday 12th October 2018
auto-mobiles_main1539318499.png-21071

న్యూఢిల్లీ: గతంలో ఒక వెలుగువెలిగిన ‘జావా’ మోటార్‌ సైకిల్‌ త్వరలోనే మళ్లీ మర రోడ్లపై రయ్‌మంటూ దూసుకుపోనుంది. మహీంద్రా గ్రూపునకు చెందిన క్లాసిక్‌ లెజెండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1929 నాటి ఈ బైక్‌లను వచ్చే నెల 15న విడుదలచేసేందుకు సిద్ధమైంది. ఈ బైక్‌ల అధునాతన 293 సీసీ ఇంజిన్‌ను గురువారం ప్రదర్శించింది. చెక్‌ రిపబ్లిక్‌లోని ప్రాగ్‌ నగరానికి చెందిన ఆనాటి మోటార్ సైకిల్‌ ఇంజిన్‌ను ఇటలీ, పూణే ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలలో అభివృద్థి పరిచినట్లు సంస్థ సీఈఓ ఆశిష్ జోషి వెల్లడించారు. క్లాసిక్‌ బైక్‌కు స్పోర్టీ ఇంజిన్‌ అనే కాన్సెప్ట్‌తోనే ఈ ఇంజిన్‌ డిజైన్‌ అయినట్లు ఆయన తెలిపారు. 250 సీసీకి మించిన విభాగంలో మొత్తం మూడు బైక్‌లను విడుదలచేస్తున్నట్లు వివరించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ తరహా బైక్‌లకు గట్టిపోటినిస్తూ మార్కెట్‌లో అడుగుపెట్టేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. మెట్రో నగరాలతో పాటు ద్వితియ, తృతియ శ్రేణి ప్రాంతాలలో కూడా పట్టుపెంచుకునే విధంగా ప్రారంభంలోనే దేశవ్యాప్తంగా 100 మంది డీలర్లతో ఈ బైక్‌ల విడుదలకు సిద్ధమైంది.



You may be interested

బీఓబీ సీఈఓ పదవీకాలం పొడిగింపు

Friday 12th October 2018

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ఎండీ, సీఈఓ పి.ఎస్‌.జయకుమార్‌ పదవీకాలం మరో ఏడాది వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2015లో పదవీ బాధ్యతలు చేపట్టిన ఈయన పదవీకాలం ఈ ఏడాది అక్టోబరు 12న (శుక్రవారం) పూర్తికానుండగా.. వచ్చే ఏడాది అక్టోబరు 12 వరకు పొడగిస్తున్నట్లు క్యాబినెట్‌ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. బీఓబీలో పదవీ బాధ్యతలు చేపట్టకముందు.. వాల్యూ బడ్జెట్‌ హౌసింగ్‌ (వీబీహెచ్‌సీ) కో-ఫౌండర్‌, సీఈఓగా కొనసాగారు.

గామన్ చైర్మన్ పాస్‌పోర్టు స్వాధీనం చేసుకోండి

Friday 12th October 2018

న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ సంస్థ గామన్ ఇండియా భారీ స్థాయిలో రుణాలు డిఫాల్ట్ అయిన నేపథ్యంలో ఆ సంస్థ చైర్మన్ అభిజిత్ రాజన్ విదేశాలకు జారుకోకుండా పాస్‌పోర్టును జప్తు చేయాలని పాస్‌పోర్టు అధికారులను బ్యాంకులు కోరాయి. ఆయన పాస్‌పోర్టు వివరాలను కన్సార్షియంలో లీడ్ బ్యాంకరు.. అధికారులకు అందజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గామన్ ఇండియాకి ఇచ్చిన సుమారు రూ. 7,000 కోట్ల రుణాలు ప్రస్తుతం నిరర్ధక ఆస్తులుగా (ఎన్‌పీఏ) మారినట్లు వివరించాయి.

Most from this category