STOCKS

News


ఇసుజు మోటార్స్‌ ధరలు పెరుగుతాయ్‌

Wednesday 5th December 2018
auto-mobiles_main1543984323.png-22637

ముంబై: జపాన్‌కు చెందిన ఇసుజు మోటార్స్‌ కంపెనీ భారత్‌లో విక్రయించే తన వాహనాల ధరలను రూ.లక్ష వరకూ పెంచుతోంది. పెంచిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని ఇసుజు మోటార్స్‌ తెలియజేసింది. ఉత్పత్తి, పంపిణి వ్యయాలు పెరిగిపోవడంతో ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొంది. వాణిజ్య వాహనాల ధరలను 1-2 శాతం రేంజ్‌లో, లైఫ్‌స్టైల్‌, అడ్వైంచర్‌ పిక్‌-అప్‌ వాహనాల ధరలను 3-4 శాతం రేంజ్‌లో పెంచనున్నామని వెల్లడించింది. ధరల పెరుగుదల రూ.15,000 నుంచి రూ.1,00,000 వరకూ (ఎక్స్‌ షోరూమ్‌) ఉంటుందని పేర్కొంది. ఇసుజు మోటార్స్‌ కంపెనీ భారత్‌లో అడ్వెంచర్‌ యుటిలిటీ వెహికల్‌​ డీ-మ్యాక్స్‌ వీ-క్రాస్‌ను, ఏడు సీట్ల ప్రీమియమ్‌ ఎస్‌యూవీ మ్యు-ఎక్స్‌ను, డీ-మ్యాక్స్‌ పికప్స్‌ వాహన వేరియంట్లను విక్రయిస్తోంది. 



You may be interested

ఎంఎస్‌ఈ రంగానికి రూ.1.23 లక్షల కోట్ల రుణాలు

Wednesday 5th December 2018

ముంబై: చిన్న వ్యాపార సంస్థల(ఎంఎస్‌ఈ)కు రుణాల లభ్యతపై నెలకొన్న ఆందోళలన్నీ భ్రమలేనని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఈ రంగానికిచ్చే రుణాల్లో మంచి వృద్ధి ఉందని స్పష్టం చేశారు. 2017 జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన అనంతరం ఎంఎస్‌ఈ రంగానికి ఇచ్చే రుణాలు 1.23 లక్షల కోట్లకు పెరిగాయని, జీఎస్టీకి ముందున్న రూ.25,700 కోట్లతో పోలిస్తే ఐదు రెట్లు పెరిగినట్టు మంగళవారం విడుదల చేసిన నివేదికలో తెలిపారు. జీఎస్టీకి ముందు చిన్న

ప్రతీ ఆరు నెలలకో కొత్త మోడల్‌

Wednesday 5th December 2018

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా వాహన దిగ్గజ కంపెనీ కియా మోటార్స్‌ వచ్చే ఏడాది జూన్‌ నుంచి భారత్‌లో వాహనాలను విక్రయించనుంది.​ ప్రతి ఆరు నెలలకూ ఒక కొత్త మోడల్‌ చొప్పున మూడేళ్లలో ఆరు కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తెస్తామని కియా మోటార్స్‌ ఇండియా సీఈఓ, ఎండీ కుక్‌యున్‌ షిమ్‌ తెలిపారు అమ్మకాలు అధికంగా ఉండే కాంపాక్ట్‌ కార్ల సెగ్మెంట్‌కు ప్రస్తుతం పెద్ద ప్రాధాన్యమివ్వటం లేదన్నారు. మూడేళ్లలో అగ్రశ్రేణి అయిదు

Most from this category