STOCKS

News


మొబైల్‌ యూజర్లు @ 142 కోట్లు!

Wednesday 28th November 2018
auto-mobiles_main1543390941.png-22444

న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 2024 నాటికి 142 కోట్లకు చేరుకోనుంది. అప్పటికి 80 శాతం మంది యూజర్లు 4జీ సేవలను వినియోగించుకునే అవకాశముందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఎరిక్సన్‌ మొబిలిటీ తెలియజేసింది. 2022 నుంచి భారత్‌లో 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది. "2020 నాటికల్లా 5జీ సర్వీసులను ప్రవేశపెడతామని భారత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఈ సర్వీసుల వినియోగం 2022 నాటికి గానీ గణనీయ స్థాయికి చేరుకోకపోవచ్చు. 2024 నాటికి 3.8 కోట్ల 5జీ సబ్‌స్క్రిప్షన్స్ ఉండొచ్చు. అప్పటి మొత్తం మొబైల్ సబ్‌స్క్రిప్షన్స్‌లో ఈ వాటా సుమారు 2.7 శాతంగా ఉంటుంది" అని ఎరిక్సన్‌ మొబిలిటీ రిపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌ ప్యాట్రిక్ సెర్వాల్ తెలిపారు. మొబైల్‌ ఫోన్లలో 1 జీబీపీఎస్‌ (గిగాబిట్‌ పర్ సెకన్‌) వేగంతో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుకోవడానికి 5జీ కనెక్షన్లు తోడ్పడతాయని చెప్పారాయన. ప్రస్తుతం 56 కోట్లుగా ఉన్న స్మార్ట్‌ఫోన్ సబ్‌స్క్రిప్షన్స్ సంఖ్య మరో ఆరేళ్లలో 100 కోట్లకు చేరగలదని, అలాగే డేటా నెలవారీ వినియోగం 6.8 జీబీ స్థాయి నుంచి 15 జీబీకి పెరగవచ్చని పేర్కొన్నారు. 
150 కోట్ల మంది 5జీ యూజర్లు..
2024 ఆఖరు నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు 150 కోట్ల స్థాయిలో 5జీ యూజర్లు ఉంటారని ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక పేర్కొంది. 5జీ వినియోగంలో ఉత్తర అమెరికా, ఈశాన్య ఆసియా ప్రాంత దేశాలు ముందు వరుసలో ఉంటాయని వివరించింది. భారత్‌లో మరికొన్నాళ్ల పాటు 4జీనే ప్రధాన టెల్కో టెక్నాలజీగా కొనసాగవచ్చని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మూడో త్రైమాసికంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 12 కోట్ల మేర పెరగ్గా.. ఇందులో భారత వాటా 3.1 కోట్లుగా ఉందని సెర్వాల్ తెలిపారు. కొత్త సబ్‌స్క్రయిబర్స్ విషయంలో ఎరిక్సన్ నివేదిక ప్రకారం 3.7 కోట్ల మంది కొత్త యూజర్లతో చైనా అగ్రస్థానంలో ఉంది.



You may be interested

నిరంతర చర్చలతో ఆర్థిక వ్యవస్థకు ఊతం!

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిరంతర చర్చలు కొనసాగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఆర్‌బీఐపై నియంత్రణసహా కీలక అంశాలకు సంబంధించి ఇటీవల కేంద్రం, ఆర్‌బీఐ మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి తాజా సూచన చేయడం గమనార్హం. భారత జౌళి పరిశ్రమ సమాఖ్య (సీఐటీఐ) వజ్రోత్సవాలను (60 సంవత్సరాలు) పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగంలో

వన్నె తగ్గుతున్న గోల్డ్‌  ఈటీఎఫ్‌లు

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: గోల్డ్‌ ఈటీఎఫ్‌ (ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌) ప్రభ మసకబారుతోంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కొనసాగుతూనే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- అక్టోబర్‌ కాలానికి ఇన్వెస్టర్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి రూ.290 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్న పెట్టుబడులు రూ.422 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద గోల్డ్‌ ఈటీఎఫ్‌లు వన్నె

Most from this category