STOCKS

News


స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో భారత్‌ది రెండో స్థానం

Friday 9th November 2018
auto-mobiles_main1541741749.png-21815

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో భారత్‌ వేగం పెంచింది. మూడవ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌) స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో అమెరికాను మూడవ స్థానానికి నెట్టింది. చైనా తర్వాత 2వ స్థానానికి చేరింది. రిసెర్చ్‌ సంస్థ- క్యానలిస్‌ గణాంకాలను పరిశీలిస్తే- సమీక్షా కాలంలో చైనా స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు 10.06 కోట్లు. భారత్‌ విషయంలో ఈ సంఖ్య 4.04 కోట్లుగా ఉంది. అమెరికా అమ్మకాలు నాలుగు కోట్లు. అయితే ఈ మూడు మార్కెట్ల అమ్మకాల్లో పెద్దగా వృద్ధి నమోదుకాకపోవడం గమనార్హం. 
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. క్షీణతే
ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ గణాంకాలు పెరక్కపోగా క్షీణించాయి. 7.2 శాతం క్షీణతతో 34.89 కోట్లకు పడ్డాయి.  మొత్తం 10 ప్రధాన మార్కెట్లను చూస్తే... ఏడు మార్కెట్లలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది. పాతవాటిని కొత్త వాటితో మార్చుకోవడం, అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు బాగుండకపోవడం, చైనా అమ్మకందారుల నుంచి పోటీ దీనికి కారణం. వీటిలో ఇండోనేషియా, రష్యా, జర్మనీలు మాత్రమే వృద్ధిని నమోదుచేసుకున్నాయి. చైనాలో అమ్మకాలు 15.2 శాతం పడిపోతే, భారత్‌లో 1.1 శాతం, అమెరికాలో 0.4 శాతం స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు తగ్గాయి. 
శామ్‌సంగ్‌ టాప్‌...
మార్కెట్‌ వాటాలో శాంసంగ్‌ 20.4 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో హువావే (14.9 శాతం), యాపిల్‌ (13.4 శాతం), షావోమీ (9.6 శాతం), ఒపో (8.9 శాతం) ఉన్నాయి. 



You may be interested

డీసీఐఎల్‌లో వ్యూహాత్మక విక్రయాలకు లైన్‌ క్లియర్‌!

Friday 9th November 2018

న్యూఢిల్లీ: నాలుగు నౌకాశ్రయాల కన్సార్షియంకు డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐఎల్‌)లో ప్రభుత్వ వాటాల వ్యూహాత్మక విక్రయాలకు గురువారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం డీసీఐఎల్‌లో ప్రభుత్వానికి 73.44 శాతం వాటా ఉంది. ‘‘డీసీఐఎల్‌లో పూర్తి 100 శాతం వాటాలను విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌, పారాదీప్‌ పోర్ట్‌ ట్రస్ట్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ ట్రస్ట్‌, కాండ్లా పోర్ట్‌ ట్రస్ట్‌లకు విక్రయించడానికి ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల

2019లో పెరగనున్న చమురు డిమాండ్‌

Friday 9th November 2018

న్యూఢిల్లీ: భారత్‌ చమురు డిమాండ్‌ 2019లో మెరుగుపడుతుందని ఫిచ్‌ సొల్యూషన్స్‌ మైక్రో రిసెర్చ్‌ గురువారం విడుదల చేసిన తన తాజా విశ్లేషణా పత్రంలో పేర్కొంది. తగిన ఆర్థిక పరిస్థితులు, కరెన్సీ స్థిరీకరణ, క్రూడ్‌ ధరల స్పీడ్ తగ్గడం దీనికి కారణాలుగా పేర్కొంది.  అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలో కొనసాగిన క్రూడ్‌ ధరలు, డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత వంటి పలు ప్రతికూలతలు 2018లో భారత్‌ చమురు డిమాండ్‌పై ప్రభావం చూపాయని నివేదిక

Most from this category