STOCKS

News


‘శాంత్రో’ బుకింగ్స్‌ ప్రారంభం

Wednesday 10th October 2018
auto-mobiles_main1539148494.png-21002

చెన్నై: అతి త్వరలోనే ‘హ్యుందాయ్‌ శాంత్రో’ మళ్లీ మార్కెట్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అక్టోబరు 23న న్యూఢిల్లీలో సరికొత్త శాంత్రోను ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్లు ప్రకటించిన హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌)... భారత్‌లో ఇది ఈ నెల తరువాత అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. అక్టోబర్‌ 10 (బుధవారం) నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ ప్రీ-బుకింగ్స్‌ కొనసాగనుండగా.. ప్రారంభ ఆఫర్‌ కింద తొలి 50,000 మంది కస్టమర్లకు రూ.11,100కే కారును బుక్‌ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తున్నట్లు సంస్థ సీఈఓ వై.కే కూ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాలుగేళ్ల విరామం తరువాత మిడ్‌-కాంపాక్ట్‌ సెగ్మెంట్‌లో మరోసారి అడుగుపెడుతున్నాం. గడిచిన మూడేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ కోసం దాదాపు రూ.740 కోట్లను పెట్టుబడిగా పెట్టాం. తొలిసారి కారు కొనుగోలు చేసే వారిని, గ్రామీణ ప్రాంతాల వారిని, టైర్‌ టూ, త్రీ టౌన్ల వినియోగదారులను లక్ష్యంగా చూస్తున్నాం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి భారత్‌లో ఉత్పత్తయ్యే అధునాత శాంత్రో కార్లను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తాం. ముఖ్యంగా దక్షిణ ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, దక్షిణ తూర్పు ఆసియా ప్రాంతాలకు ఎక్స్‌పోర్ట్స్‌ జరుగుతాయి. దేశీ మార్కెట్‌లో నెలకు 8,000- 10,000 యూనిట్లుగా నిర్థేశించుకున్నాం.’ అని వివరించారు. ఏహెచ్‌2 కాన్సెప్ట్‌తో కొనసాగిన ఈ నూతన కారులో 4-సిలెండర్‌ 1.1 లీటర్ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చినట్లు తెలిపారు. సీఎన్‌జీ కిట్‌తో పాటు మ్యాన్యువల్, ఆటోమేటెడ్‌ ట్రాన్స్‌మిషన్‌లలో సరికొత్త శాంత్రో లభ్యం కానుంది. 



You may be interested

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ రుణ ఖాతా మనుగడలోనే ఉంది: బీవోబీ

Wednesday 10th October 2018

 ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంస్థ రుణ ఖాతా తమ వద్ద కొనసాగుతూనే ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) స్పష్టం చేసింది. ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలకు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు రుణాలు మం‍జూరు ఇకపైనా కొనసాగుతుందని తెలిపింది. ‘‘ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు రుణాలిచ్చి ఉన్నాం. ప్రస్తుతానికి ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సహా ఇతర అన్ని ఎన్‌బీఎఫ్‌సీ ఖాతాలు పనిచేస్తూనే ఉన్నాయి. రేపు ఎలా ఉంటాయన్న దానిపై రేపే మాట్లాడగలం తప్ప ఇప్పుడేమీ చెప్పలేం’’ అని బీవోబీ చీఫ్‌ పీఎస్‌

2018లో 7.3...2019లో 7.4..!

Wednesday 10th October 2018

వాషింగ్టన్‌: భారత్‌ 2018లో 7.3 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును సాధిస్తుందని అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వెలువరించింది. 2019లో ఈ రేటు 7.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. అయితే తాజా అంచనాలు 2018 ఏప్రిల్‌లో ఇచ్చిన అంచనాలకన్నా కొంచెం తక్కువగా ఉండడం గమనార్హం.  మొత్తంగా ఈ ఏడాది ‘ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’ హోదాను భారత్‌ 2018లో  కైవసం చేసుకుంటుందని వివరించింది.

Most from this category