News


హువావే ‘మేట్‌ 20’ సిరీస్‌లో 4 స్మార్ట్‌ఫోన్స్‌

Thursday 18th October 2018
auto-mobiles_main1539856757.png-21273

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘హువావే’ తాజాగా ‘మేట్‌ 20’ సిరీస్‌లో నాలుగు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ‘హువావే మేట్‌ 20’, ‘హువావే మేట్‌ 20 ప్రో’, ‘హువావే మేట్‌ 20 ఎక్స్‌’, ‘హువావే మేట్‌ 20 ఆర్‌ఎస్‌ పోర్షే డిజైన్‌’ అనేవి వీటి పేర్లు. కంపెనీ వీటిల్లో తొలిసారిగా 7 ఎన్‌ఎం కిరిన్‌ 980 ప్రాసెసర్‌ను ఉపయోగించింది. అలాగే రెండో జనరేషన్‌ లైకా ట్రిపుల్‌ కెమెరా వ్యవస్థను అమర్చింది. వీటిల్లోకి ప్రత్యేకతల విషయానికి వస్తే..

హువావే మేట్‌ 20 ప్రో
కంపెనీ ఇందులో తొలిసారిగా కర్వ్‌డ్‌ ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అమర్చింది. 6.39 అంగుళాల నాచ్‌ డిస్‌ప్లే, 3డీ ఫేస్‌ అన్‌లాక్‌, ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌, 4.5జీ ఎల్‌టీఈ సపోర్ట్‌, ట్రిపుల్‌ రియర్‌ కెమెరా (40 ఎంపీ+ 20 ఎంపీ+8 ఎంపీ), 24 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 4,200 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌ (అర గంటలో 70 శాతం చార్జ్‌ అవుతుంది), రివర్సిబుల్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌, ఐపీ 68 వాటర్‌/డస్ట్‌ రెసిస్టెంట్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ మెమరీ, ఆండ్రాయిడ్‌ 9.0 ఓఎస్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. దీని ధర సుమారు రూ.90,000.

హువావే మేట్‌ 20
ఇందులో 6.53 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌, నాచ్‌ డిస్‌ప్లే, 24 ఎంపీ ‍ఫ్రంట్‌ కెమెరా, ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌, ట్రిపుల్‌ కెమెరా (12 ఎంపీ+ 16 ఎంపీ+ 8 ఎంపీ), 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4 జీబీ/ 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ మెమరీ, ఆండ్రాయిడ్‌ 9.0 ఓఎస్‌ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. దీని ప్రారంభం ధర సుమారు రూ.68,000. 

హువావే మేట్‌ 20ఎక్స్‌
ఇందులో 7.2 అంగుళాల స్క్రీన్‌, 24 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ మెమరీ, ట్రిపుల్‌ రియర్‌ కెమెరా (40 ఎంపీ+ 20 ఎంపీ+ 8 ఎంపీ), 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. దీని ధర సుమారు రూ.76,500.

కంపెనీ హువావే మేట్‌ 20 ఆర్‌ఎస్‌ పోర్షే డిజైన్‌ అనే మరొక స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఆవిష్కరించింది. ఇది లిమిటెడ్‌ ఎడిషన్‌. దీని ప్రారంభ ధర రూ.1.45 లక్షలు.



You may be interested

ఆరునెలల్లో రూపీ@80

Thursday 18th October 2018

ఇండియానివేష్‌ సెక్యూరిటీస్‌ వచ్చే ఆరు నెలల కాలంలో రూపాయి 79- 80 స్థాయిలకు చేరే ఛాన్సులున్నాయని ఇండియానివేష్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి ధర్మేశ్‌ కాంత్‌ అభిప్రాయపడ్డారు. అయితే రూపీ ఈ స్థాయికి చేరినా ఆరునెలల అనంతరం క్రమంగా కన్సాలిడేట్‌ చెంది చివరకు 72- 74 రేంజ్‌లో సెటిల్‌ కావచ్చని అంచనా వేశారు. దేశీయ మార్కెట్లలో ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్‌ బ్యాంక్స్‌, ఫార్మా రంగాలపై పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పారు. ఇటీవల కాలంలో ఎఫ్‌ఐఐలు ఇండియా నుంచి

జెట్‌లో టాటాకు వాటా??

Thursday 18th October 2018

దేశీ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌.. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోందనే వార్త ఇప్పుడు మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఇది ఎంత వరకు నిజమో తెలీదు కానీ.. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం చూస్తే.. టాటా గ్రూప్‌.. జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా కొనుగోలు కోసం చర్చలు ప్రారంభించింది. ఇందులో భాగంగా టాటా గ్రూప్‌.. జెట్‌ ఎయిర్‌వేస్‌లో మేనేజ్‌మెంట్‌

Most from this category