STOCKS

News


హానర్‌ కొత్త ఫోన్‌.. ‘8సీ’

Thursday 29th November 2018
auto-mobiles_main1543478611.png-22484

ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘హానర్‌’ తాజాగా ‘8సీ’ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.11,999 నుంచి ప్రారంభమౌతోంది. స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు డిసెంబర్‌ 10 నుంచి ప్రారంభమౌతాయి. ఇవి కేవలం అమెజాన్‌లో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. హానర్‌ 8సీ లోని ప్రత్యేకతలను గమనిస్తే.. 

► 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
► క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 632 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ (ప్రపంచంలోనే ఈ ప్రాసెసర్‌తో వస్తోన్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే)
► 13 ఎంపీ+ 2 ఎంపీ ఏఐ డ్యూయెల్‌ కెమెరా
► 19:9 ఫుల్‌వ్యూ డిస్‌ప్లే
► ఐ-కేర్‌ మోడ్‌
► ఫేస్‌ అన్‌లాక్‌
► 4 జీబీ ర్యామ్‌
► 32 జీబీ మెమరీ/ 64 జీబీ మెమరీ
► 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
► ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌
► ఆండ్రాయిడ్‌ 8.1 ఓఎస్‌
► 6.26 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ స్క్రీన్‌
► ధర: 4 జీబీ+ 32 జీబీ వేరియంట్‌= రూ.11,999
          4 జీబీ+ 64 జీబీ వేరియంట్‌= రూ.12,999



You may be interested

థండర్‌బర్డ్‌ 500ఎక్స్‌లో ఏబీఎస్‌ వేరియంట్‌

Thursday 29th November 2018

ధర రూ.2.13 లక్షలు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తన పోర్ట్‌ఫోలియోలోని బైక్స్‌ను 2019 ఏప్రిల్‌ నుంచి అమలులోకి రానున్న కొత్త భద్రతా ‍ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్‌ చేసుకుంటోంది. కంపెనీ అందులో భాగంగా తాజాగా థండర్‌బర్డ్‌ 500ఎక్స్‌లో ఏబీఎస్‌ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి మార్కెట్‌లోకి రానున్న 125 సీసీ, అటుపై ఇంజిన్‌లను కలిగిన బైక్స్‌కు ఏబీఎస్‌ (యాంటీ బ్రేక్‌ లాక్‌ సిస్టమ్‌) ఫీచర్‌ తప్పనిసరి.

2019 ఈక్విటీనామ సంవత్సరం!!

Thursday 29th November 2018

మెటల్స్‌ మెరవొచ్చు.. ఐఐఎఫ్‌ఎల్‌ సంజీవ్‌ భాసిన్‌ అంచనా ఈక్విటీ మార్కెట్‌పై ఏడాది కాల లక్ష్యంతో చాలా బుల్లిష్‌గా ఉన్నానని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెట్స్‌ అండ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌) సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. ఈక్విటీలు 2019లో మంచి పనితీరు కనబరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయలు వెల్లడించారు. ఎన్నికల కారణంగా కొంత కాలం ఒడిదుడుకులు ఉంటాయని తెలిపారు.  నెల కిందట అక్టోబర్‌ 29న

Most from this category