STOCKS

News


హానర్‌ 7ఎస్‌... రూ.6,999

Wednesday 5th September 2018
auto-mobiles_main1536124295.png-19963

న్యూఢిల్లీ: చైనాకు చెందిన హువావే, హానర్‌ బ్రాండ్‌ కింద 7ఎస్‌ మోడల్‌ను దేశీయ మార్కెట్లోకి మంగళవారం విడుదల చేసింది. దీని ధర రూ.6,999. ఈ నెల 14 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలకు సిద్ధంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అలాగే, కంపెనీ సొంత పోర్టల్‌ హాయ్‌ హానర్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లోనూ దీన్ని కొనుగోలు చేయొచ్చు. గోల్డ్‌, బ్లూ, బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. 5.45 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌, 18:9 రేషియో ఫుల్‌ వ్యూ డిస్‌ప్లే, వెనుక భాగంలో 13 మెగాపిక్సల్‌ హెచ్‌డీ కెమెరా (పీడీఏఎఫ్‌ టెక్నాలజీ), ముందు భాగంలో 5 మెగా పిక్సల్‌ కెమెరా, ఎల్‌ఈడీ సెల్ఫీ లైట్‌, ఫేస్‌ అన్‌లాక్‌, 3,020 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి. 2జీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజీతో వస్తుంది. కావాలనుకుంటే మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు స్టోరేజీ పెంచుకోవచ్చు. ఇందులో క్వాడ్‌కోర్‌ మీడియాటెక్‌ ఎంటీ 6739 ప్రాసెసర్‌ ఏర్పాటు చేశారు. 4జీ ఓల్టే సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0 అపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేస్తుంది.   
 You may be interested

60 బిలియన్‌ డాలర్లతో 100 కొత్త విమానాశ్రయాలు!

Wednesday 5th September 2018

న్యూఢిల్లీ: రానున్న 10-15 ఏళ్లలో 100 కొత్త విమానాశ్రాయాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తెలియజేశారు. ఇందుకు దాదాపు 60 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4.2 లక్షల కోట్లు) వ్యయం అవుతుందని మంగళవారమిక్కడ ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. గత మూడేళ్లుగా విమాన ప్రయాణికుల డిమాండ్‌ పుంజుకోవడంతో దేశీ విమానయాన రంగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తున్న సంగతి

విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు తగ్గుముఖం

Wednesday 5th September 2018

ముంబై: దేశీయ కంపెనీల విదేశీ పెట్టబడులు ఈ ఏడాది జూలై నెలలో 36 శాతం తగ్గుముఖం పట్టాయి. ఆర్‌బీఐ గణాంకాలను పరిశీలిస్తే... భారత కంపెనీల విదేశీ పెట్టుబడులు ఈ ఏడాది జూలైలో 1.39 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే నెలలో మన కంపెనీల విదేశీ పెట్టుబడులు 2.17 బిలియన్‌ డాలర్లు. విదేశీ సబ్సిడరీలు, జాయింట్‌ వెంచర్లపై కంపెనీలు పెట్టుబడులు పెడుతుంటాయి. రుణాల రూపంలో, ఈక్విటీ, గ్యారంటీల రూపంలో ఈ

Most from this category