STOCKS

News


4 కోట్లకు హోండా వాహన విక్రయాలు

Friday 21st December 2018
auto-mobiles_main1545369649.png-23128

న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌​ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ) వాహన విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మైలురాయిని అధిగమించాయి. ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల అమ్మకాల మైలురాయిని 18 ఏళ్లలోనే సాధించామని హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ తెలిపింది. మొదటి 2 కోట్ల వాహన అమ్మకాలు 14 ఏళ్లలో సాధించగా, తర్వాతి 2 కోట్ల వాహన విక్రయాలను నాలుగేళ్లలోనే సాధించగలిగామని హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ ప్రెసిడెంట్‌, సీఈఓ మినోరు కటో తెలిపారు. ఆరంభం నుంచే అత్యున్నత నాణ్యత గల వాహనాలను అందించి వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొన్నామని పేర్కొన్నారు. నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించడం, విస్తృతమైన రేంజ్‌లో స్కూటర్లు, మోటార్‌సైకిళ్లను అందించడం ద్వారా వినియోగదారుల కలలను నిజం చేసి, వారిని సంతోష పెట్టే దిశగా సాగుతున్నామని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యధ్‌విందర్‌ సింగ్‌ గులేరియా వివరించారు. 



You may be interested

పెరుగుతున్న హ్యుందాయ్‌ కార్ల ధరలు

Friday 21st December 2018

న్యూఢిల్లీ: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా కంపెనీ కార్ల ధరలను పెంచుతోంది. అన్ని మోడళ్ల ధరలను రూ.30,000 వరకూ పెంచుతున్నామని హ్యుందాయ్‌ కంపెనీ తెలిపింది. పెరిగిన ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను కొంతవరకైనా తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని వివరించింది. ఈ కంపెనీ రూ.3.89 లక్షల నుంచి రూ.26.84 లక్షల రేంజ్‌లో ధరలుండే శాంత్రో హ్యాచ్‌బాక్‌ నుంచి ఎస్‌యూవీ ట్యూసన్‌ వరకూ

బ్యాంకులకు మూలధనం జోష్‌!!

Friday 21st December 2018

న్యూఢిల్లీ: మొండిబాకీలు, నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) కేంద్రం మరింత మూలధనం సమకూర్చనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న దానికి అదనంగా రూ.41,000 కోట్లు ఇవ్వనుంది. దీంతో పీఎస్‌బీలకు ఈ ఏడాది మొత్తం మీద రూ.1.06 లక్షల కోట్లు ఇచ్చినట్లవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఈ విషయాలు తెలియజేశారు. వాస్తవానికి 2018-19లో పీఎస్‌బీలకు రూ. 65,000 కోట్లు అదనపు మూలధనం ఇవ్వాలని కేంద్రం

Most from this category