STOCKS

News


హోండా నుంచి కొత్త ‘సీఆర్‌-వీ’

Wednesday 10th October 2018
auto-mobiles_main1539146874.png-20993

న్యూఢిల్లీ: జపనీస్‌ ఆటోమేజర్‌ హోండా... సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీని మంగళవారం భారత మార్కెట్‌లో విడుదలచేసింది. సీఆర్‌-వీ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈకారు మొత్తం మూడు వేరియంట్లలో లభ్యమవుతోంది. టూవీల్‌ డ్రైవ్‌ పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.28.15 లక్షలు, డీజిల్‌ ధర రూ.28.15 లక్షలు కాగా, ఆల్‌వీల్‌ డ్రైవ్‌ ధర రూ.30.65 లక్షలుగా నిర్ణయించినట్లు హోండా కార్స్‌ ఇండియా సీఈఓ గకు నకనిషి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కస్టమర్లు విలాస, సౌకర్యవంతమైన ఎస్‌యూవీల కొనుగోలుకు మారుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో నూతన సీఆర్‌-వీ గేమ్‌ చేంజర్‌ కానుందని భావిస్తున్నాం.’ అని వ్యాఖ్యానించారు. 



You may be interested

వాయిస్‌ ఆదేశాలతో టీవీ!!

Wednesday 10th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: టీవీ పనిచేయాలంటే రిమోట్‌ వాడాలి. అసలు రిమోట్‌ను ఆపరేట్‌ చేసే అవసరం లేకుండా మాటలతోనే పనిచేస్తే..! ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం ఎల్‌జీ భారత్‌లో ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీ ఆధారంగా వాయిస్‌ కమాండ్‌తో పనిచేసే థింక్యూ టీవీలను ప్రవేశపెట్టింది. చానెల్‌, పాటలు, వీడియోలు, గేమ్స్‌, ఫోటోలు.. ఇలా ఏది కావాలన్నా వాయిస్‌తో ఆదేశిస్తే చాలు. టీవీ పనిచేస్తుంది. ఇంట్లో ఇంటర్నెట్‌ ఉండాల్సిన అవసరం లేకపోవడం మరో

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 10th October 2018

వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- అమెరికాలో మార్కెట్‌లో డయాబెటీస్‌ చికిత్సలో వినియోగించే కోలేసెవేలామ్‌ హెచ్‌సీఎల్‌ ఔషధాలను విడుదల చేసింది. ఈ ఔషధ వార్షిక మార్కెట్‌ విలువ రూ.34వేల కోట్లు ఉంటుంది. హెల్త్‌కేర్‌ గ్లోబల్స్‌:​- తన అనుబంధ సంస్థ ఇండియా మెడికల్‌ డయాగ్నస్టిక్స్ వ్యాపారాన్ని సొంతం చేసుకునేందుకు క్వెస్ట్‌ డయాగ్నస్టిక్స్ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చకుంది. ఎన్‌సీఎల్‌ ఇండియా:- రూ.1249 కోట్ల షేర్ల బై బ్యాక్‌ ఇష్యూకు బోర్డు

Most from this category