STOCKS

News


మరోమైలు రాయిని దాటిన ‘హోండా యాక్టివా’

Thursday 18th October 2018
auto-mobiles_main1539834137.png-21256

ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్‌ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఎస్ఐ)... తాజాగా మరో మైలు రాయిని దాటింది. కంపెనీ ఫ్లాగ్‌షిప్‌ టూవీలరైన ‘యాక్టివా’ అమ్మకాలు 2 కోట్లకు చేరుకున్నట్లకు ప్రకటించింది. మొదటి కోటి యాక్టివాలను విక్రయించడానికి 15 ఏళ్ల సమయం పట్టగా, ఆ తరువాత కోటి వాహనాల అమ్మకాలకు కేవలం మూడేళ్లలోనే పూర్తిచేయగలిగినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ మినోరు కటో మాట్లాడుతూ.. ‘గడిచిన 18 ఏళ్లలో ఐదు జనరేషన్ల యాక్టివాలను విడుదల చేశాం. జపనీస్‌ మాతృ సంస్థకు ఈ టూవీలర్‌ 33 శాతం అంతర్జాతీయ మార్కెట్‌ వాటాను అందిస్తోంది.’ అని వ్యాఖ్యానించారు. ఆటోమెటిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుండడం వల్లనే యాక్టివా అమ్మకాలు సరికొత్త మైలు రాయిని అధిగమించాయని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వై.ఎస్ గులేరియా అన్నారు.



You may be interested

ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ లాభం 66 శాతం అప్‌

Thursday 18th October 2018

న్యూఢిల్లీ: ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 66 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.67 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.119 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ సుధీర్‌ సింగ్‌ తెలిపారు. ట్రావెల్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బీమా విభాగాలు మంచి వృద్ధిని సాధించాయని వివరించారు.  ఆదాయం రూ.737 కోట్ల నుంచి 23 శాతం పెరిగి

ఆర్థిక వృద్ధికి 'ఫ్లెక్సిబుల్' వర్కింగ్ ఊతం

Thursday 18th October 2018

న్యూఢిల్లీ: సరళతర పని విధానాలు (ఫ్లెక్సిబుల్ వర్కింగ్‌) దేశ ఆర్థిక వృద్ధికి ఊతమివ్వనున్నాయి. కార్పొరేట్లు వ్యయాలు తగ్గించుకోవడానికి, ఉద్యోగుల ఉత్పాదకత మెరుగుపడటానికి ఇవి దోహదపడనున్న నేపథ్యంలో 2030 నాటికల్లా ఈ విధానాలతో ఎకానమీకి ఏటా 376 బిలియన్ డాలర్ల మేర అదనపు ప్రయోజనం చేకూరనుంది. అంతర్జాతీయ వర్క్‌స్పేస్ సంస్థ రీగస్ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా తదితర 16 దేశాల్లో నిర్వహించిన ఈ అధ్యయనం

Most from this category