STOCKS

News


హీరో వాహనాలు మరింత ప్రియం

Thursday 27th September 2018
auto-mobiles_main1538023118.png-20617

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ వాహనాల రేట్లను రూ. 900 దాకా పెంచనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. పెరుగుతున్న ముడివస్తువుల రేట్లు, రూపాయి మారకం పతనం ప్రభావాలను ఎదుర్కొనేందుకు రేట్లను పెంచాల్సి వస్తోందని సంస్థ తెలిపింది. మోడల్‌, మార్కెట్‌ను బట్టి రేట్ల పెంపు రూ. 900 దాకా ఉంటుందని వివరించింది. కంపెనీ గత నెలలో కూడా రూ. 500 దాకా రేట్లను పెంచింది. హీరో మోటోకార్ప్ ప్రస్తుతం రూ. 40,000 నుంచి రూ. 1 లక్ష దాకా ఖరీదు చేసే స్కూటర్స్, బైక్‌లను విక్రయిస్తోంది. బుధవారం బీఎస్‌ఈలో హీరో మోటోకార్ప్ షేరు ధర స్వల్పంగా క్షీణించి రూ. 3,104.50 వద్ద ముగిసింది. 



You may be interested

టాటా టెలి ‘స్మార్ట్‌ ఆఫీస్‌’

Thursday 27th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: టెలికం కంపెనీ టాటా టెలి బిజినెస్‌ సర్వీసెస్‌ చిన్న, మధ్యతరహా (ఎస్‌ఎంఈ) కంపెనీల కోసం స్మార్ట్‌ ఆఫీస్‌ పేరుతో సేవలను ప్రారంభించింది. వాయిస్‌, డేటా, స్టోరేజ్‌తోపాటు అప్లికేషన్స్‌ వంటి ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సంబంధ సేవలన్నీ ఒకే గొడుగు కింద లభించడం దీని ప్రత్యేకత. నూతన కార్యాలయం ఏర్పాటు చేయాలనుకునే ఎస్‌ఎంఈలకు స్మార్ట్‌ ఆఫీస్‌ చక్కని పరిష్కారమని కంపెనీ చెబుతోంది. అందుబాటు ధరలోనే చార్జీలు ఉంటాయని సంస్థ

నంబరు పోర్టబిలిటీ మరింత సులభతరం

Thursday 27th September 2018

న్యూఢిల్లీ: మొబైల్ నంబర్ పోర్టబిలిటీని (ఎంఎన్‌పీ) మరింత సులభతరం చేసే క్రమంలో ఇందుకు సంబంధించిన నిబంధనలను సడలించే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రతిపాదనలు చేసింది. వీటి ప్రకారం ఇకపై యూనిక్ పోర్టింగ్ కోడ్ (యూపీసీ)ని జనరేట్ చేసే బాధ్యతను ఎంఎన్‌పీ సర్వీస్ ప్రొవైడర్‌ (ఎంఎన్‌పీఎస్‌పీ)కి అప్పగించింది. ప్రస్తుత విధానం ప్రకారం టెలికం సంస్థే దీన్ని జనరేట్ చేసి సబ్‌స్క్రయిబర్‌కి పంపుతోంది. అయితే, నంబర్ పోర్ట్‌ చేసుకోవడానికి

Most from this category