STOCKS

News


మార్కెట్లోకి హీరో ‘డెస్టినీ 125’

Tuesday 23rd October 2018
auto-mobiles_main1540270059.png-21378

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌.. దేశీ మార్కెట్‌లో ‘డెస్టినీ 125’ పేరిట సరికొత్త స్కూటర్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ మోడల్‌ ధరల శ్రేణి రూ.54,650–రూ.57,500గా ఉన్నట్లు ప్రకటించింది. ఢిల్లీ/ఎన్‌సీఆర్‌లో విక్రయాలు ప్రారంభం కాగా, దేశవ్యాప్త అమ్మకాలు వచ్చే 3–4 వారాల్లో ప్రారంభంకానున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ సందర్భంగా సంస్థ గ్లోబ‌ల్ ప్రోడ‌క్ట్ ప్లానింగ్ హెడ్ మాలో లీ మాస‌న్ మాట్లాడుతూ.. ‘125-సీసీ విభాగానికి చెందిన స్కూటర్‌ మార్కెట్‌ గణనీయంగా విస్తరిస్తోంది. ఏడాది ప్రాతిపదికన 75 శాతం వృద్ధిరేటును నమోదుచేసింది. ఈ విభాగంలో బహుళ బ్రాండ్ విధానాన్ని అనుసరిస్తున్నాం. ఈ ఏడాది చివరినాటికి మరో స్కూటర్‌నూ విడుదలచేయనున్నాం’’ అని వివరించారు.



You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 23rd October 2018

ప్రపంచ మార్కెట్లో మంగళవారం పసిడి ధర స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు ఇందుకు కారణమవుతున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.9:45ని.లకు ఔన్స్‌ పసిడి ధర 3డాలర్ల పెరిగి 1227.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సౌది అరేబియా, పాశ్చత్య దేశాల మధ్య ముదిరిన రాజకీయ వివాదాలకు తోడు, బ్రెగ్జిట్‌, ఇటలీ బడ్జెట్‌ తదితర వివాదస్పద అంశాలు మరోసారి తెరపైకి వచ్చా‍యి.

9 శాతం పెరిగిన సీసీఎల్‌ లాభం

Tuesday 23rd October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్‌ ఫలితాల్లో సీసీఎల్‌ ప్రొడక్ట్స్ నికరలాభం క్రితంతో పోలిస్తే 9 శాతం పెరిగి రూ.28 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.217 కోట్ల నుంచి రూ.214 కోట్లకు ఎగసింది. సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 2.26 శాతం తగ్గి రూ.241.75 వద్ద స్థిరపడింది.

Most from this category