STOCKS

News


పిక్సెల్ త్రీ విడుదల..

Wednesday 10th October 2018
auto-mobiles_main1539149006.png-21008

పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్ సిరీస్‌లో గూగుల్ మంగళవారం పిక్సెల్ 3, పిక్సెల్ 3 ఎక్స్‌ఎల్‌ పేరిట కొత్త ఫోన్స్‌ను ఆవిష్కరించింది. భారత్‌లో పిక్సెల్ 3 రేటు రూ. 71,000 నుంచి రూ. 80,000 దాకా ఉండనుండగా, పిక్సెల్ 3 ఎక్స్‌ఎల్‌ రేటు రూ. 83,000 నుంచి రూ. 92,000దాకా ఉంటుంది. ఇవి 64జీబీ, 128 జీబీ వెర్షన్లలో లభిస్తాయి. అమెరికా మార్కెట్లో ‍అక్టోబర్ 19 నుంచి, భారత్‌ సహా మిగతా దేశాల్లో నవంబర్ 1 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. పిక్సెల్ 3 స్క్రీన్ 5.5 అంగుళాలు, 3 ఎక్స్‌ఎల్‌ తెర 6.3 అంగుళాలు ఉంటుంది. పిక్సెల్ 3 ఫోన్‌లో ముందువైపు రెండు కెమెరాలు ఉంటాయి. మరోవైపు, అమెరికా మిలిటరీ కంప్యూటింగ్ సిస్టమ్స్‌ను ఆధునికీకరించేందుకు ఉద్దేశించిన పెంటగాన్ ప్రాజెక్టుకు బిడ్ చేయబోవడం లేదని గూగుల్ తెలిపింది. ఈ కాంట్రాక్టు విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లు. తమ ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్‌ విధానాలకు ఈ కాంట్రాక్టు నిబంధనలు అనుగుణంగా లేవని గూగుల్ పేర్కొంది. 



You may be interested

టైమ్‌షేర్‌ ప్రాపర్టీలోకి ‘ఫెర్న్స్‌’ ఎంట్రీ

Wednesday 10th October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ఫెర్న్స్‌ ఎస్టేట్‌ అండ్‌ డెవలపర్స్‌ లగ్జరీ టైమ్‌షేర్‌ ప్రాపర్టీ విభాగంలోకి ప్రవేశించింది. తొలి దశలో రూ.700 కోట్ల పెట్టుబడులతో కర్నాటకలోని సక్లేశ్‌పూర్‌లో క్లబ్‌ రోసెట్టా పేరుతో టైమ్‌షేర్‌ ప్రాపర్టీని నిర్మించన్నునట్లు జాయింట్‌ ఎండీ అండ్‌ సీఈఓ జై శ్రీధర్‌ మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారు. 100 ఎకరాల్లో రానున్న ఈ ప్రాజెక్ట్‌లో 100 గదులు, 3 రెస్టారెంట్లు, బాంక్విట్‌

రూ.45,000 కోట్ల ఆస్తులు కొంటాం

Wednesday 10th October 2018

న్యూఢిల్లీ: నిధుల కటకటతో కష్టాలుపడుతున్న నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లను ఆదుకోవడానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ముందుకు వచ్చింది. ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులను(రుణ పోర్ట్‌ఫోలియోలను) రూ.45,000 కోట్ల మేర కొనుగోలు చేయాలని ఎస్‌బీఐ నిర్ణయించింది.  ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌  చంద్ర గార్గ్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఎస్‌బీఐ నిర్ణయంతో ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సమస్య తీరుతుందని ఆయన పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలు రుణాల చెల్లింపుల్లో విఫలం

Most from this category