STOCKS

News


వివో వీ9పై రూ.8,000 డిస్కౌంట్‌

Monday 22nd October 2018
auto-mobiles_main1540191974.png-21359

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ వివో.. వీ9 స్మార్ట్‌ఫోన్‌ ధరను మళ్లీ తగ్గించింది. ఫోన్‌ ధరను తగ్గించడం ఇది మూడోసారి. కంపెనీ వీ9 ఫోన్‌ను రూ.23,990 ధరతో తొలిగా మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వివో తర్వాత దీని ధర రూ.3,000 తగ్గించింది. అప్పుడు ఇది రూ.20,990 అందుబాటులోకి వచ్చింది. అటుపైన మళ్లీ ఫోన్‌ ధరను రూ.2,000 తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఈ వీ9 స్మార్ట్‌ఫోన్‌ రూ.18,990కి కస్టమర్లకు అందుబాటులో ఉంది. అయితే తాజాగా అక్టోబర్‌ 24-27 తేదీల్లో జరగనున్న ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివ్‌ ధమాకా డే సేల్‌లో ఈ ఫోన్‌ రూ.15,990 అందుబాటులో ఉండనుంది. అంటే ఫోన్‌ ధర రూ.3,000 తగ్గింది. అంటే మొత్తంగా చూస్తే వీ9 స్మార్ట్‌ఫోన్‌ రూ.8,000 డిస్కౌంట్‌తో కస్టమర్లకు అందుబాటులోకి వస్తోంది. తాజా ధర తగ్గింపు నేపథ్యంలో వీ9 స్మార్ట్‌ఫోన్‌ ఆకర్షణీయంగానే కనిపిస్తోంది.   

వీ9 ప్రత్యేకతల విషయానికి వస్తే..
వీ9లో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 626 ప్రాసెసర్‌, 64 జీబీ మెమరీ, 16 ఎంపీ+ 5 ఎంపీ రియర్‌ కెమెరా, 24 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3,260 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 6.3 అంగుళాల ఫుల్‌హెడ్‌డీ ప్లస్‌ ఫుల్‌వ్యూ డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌ ఓరియో ఓఎస్‌, ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌, ఫేస్‌ అన్‌లాక్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. 



You may be interested

రెండంకెల రాబడి కోసం ఐదు షేర్లు

Monday 22nd October 2018

మార్కెట్లో బౌన్స్‌ బ్యాక్‌ మరో వారం కొనసాగకపోవచ్చని నార్నోలియా బ్రోకరేజ్‌ అభిప్రాయపడింది. అయితే దీర్ఘకాలంలో సూచీలు బుల్లిష్‌గా ఉంటాయని తెలిపింది. లాంగ్‌టర్మ్‌లో రెండంకెల రాబడినిచ్చే ఐదు షేర్లను సిఫార్సు చేసింది. 1. కోల్‌ ఇండియా: టార్గెట్‌ రూ. 322. స్టాప్‌లాస్‌ రూ. 254. స్వల్పకాలిక కన్సాలిడేషన్‌ అనంతరం పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. కొన్ని రోజులుగా హెడ్‌ అండ్‌ షోల్డర్‌ ఫార్మేషన్‌ ఏర్పరుస్తోంది. దిగువన రూ. 276 స్థాయిల్లో డబుల్‌బాటమ్‌ ఏర్పరుచుకుంది. ఇండికేటర్లు

బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ 

Monday 22nd October 2018

ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సానుకూల ఆర్థిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం బ్యాంకింగ్‌ షేర్లు జోరుగా పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2 శాతంపైగా జంప్‌చేసి రూ.2014 గరిష్టస్థాయికి చేరిన అనంతరం ఉదయం 12 గంటల సమయానికి రూ. 2000 సమీపంలో ట్రేడవుతోంది. ఈ షేరు వెయిటేజీ అధికంగా కలిగిన బ్యాంక్‌ నిఫ్టీ ఇదే సమయానికి 1.4 శాతం ర్యాలీ జరిపి 25,400 పాయింట్ల స్థాయిని అధిగమించింది.

Most from this category