STOCKS

News


ఐదేళ్లలో 6,500 చార్జింగ్‌ స్టేషన్లు

Thursday 29th November 2018
auto-mobiles_main1543469113.png-22468

ముంబై: ఈవీ మోటార్స్‌ ఇండియా కంపెనీ ఐదేళ్లలో 6,500 చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నది. ప్లగ్‌ఎన్‌గో పేరుతో ఈ చార్జింగ్‌ స్టేషన్లను డీఎల్‌ఎఫ్‌, ఏబీబీ ఇండియా, డెల్టా ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల భాగస్వామ్యంతో  ఏర్పాటు చేయనున్నామని ఈవీ మోటార్స్‌ తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నామని ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ స్టార్టప్‌ తెలిపింది.  వివిధ నగరాల్లో వ్యాపార, నివాసిత ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ఈవీ మోటార్స్‌ ఇండియా ఎమ్‌డీ వినీత్‌​ బన్సాల్‌ చెప్పారు. క్లౌడ్‌ ఆధారిత ఇంటిగ్రేటేడ్‌ సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫార్మ్‌ ద్వారా వీటిని అనుసంధానిస్తామని వివరించారు.

ఏడాది కాలంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 20 ప్లగ్ఎన్‌గో అవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్‌, బెంగళూరు, చంఢీఘర్‌, జైపూర్‌, అహ్మదాబాద్‌, కాన్పూర్‌, కోల్‌కత, ముంబై, పుణే, అమృత్‌సర్‌, భువనేశ్వర్‌, కొచ్చిన్‌, ఇండోర్‌, చెన్నైల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నగరాల్లో సర్వీస్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ వాహనాలు భారీగా రానున్నాయని, రియల్‌ఎస్టేట్‌ డెవలపర్లు, వాహన కంపెనీలు, బ్యాటరీ చార్జర్‌ తయారీదార్ల మధ్య సహకార సమన్వయం అవసరమని వివరించారు. 


 



You may be interested

న్యూజ్‌లో వాటా కొన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Thursday 29th November 2018

న్యూఢిల్లీ: మీడియా స్టార్టప్‌ న్యూ ఎమర్జింగ్‌ వరల్డ్‌ ఆఫ్‌ జర్నలిజమ్‌లో (న్యూజ్‌) మెజారిటీ వాటాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన కంపెనీ కొనుగోలు చేసింది. రిలయన్స్‌కు చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌ లమిటెడ్‌(అర్‌ఐఐహెచ్‌ఎల్‌) ఈ వాటాను రూ. 1.03 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్‌లో భాగంగా 30 వేల ఈక్విటీ షేర్లను, 125 కంపల్సరీ కన్వర్టబుల్‌ డిబెంచర్లను ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌ కొనుగోలు చేసింది. దీంతో ఇక నుంచి న్యూజ్‌

భారీగా పెరుగుతున్న సంపద

Thursday 29th November 2018

న్యూఢిల్లీ: భారత్‌లో అధిక విలువ కలిగిన వ్యక్తుల (హెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) సంపద అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2017లో 22 శాతం పెరిగింది. ఆసియా ప్రాంతంలో ఇది వేగవంతమైన వృద్ధి అని క్యాప్‌జెమిని సంస్థ తెలిపింది. ఈ సంస్థ ఆసియా పసిఫిక్‌ వెల్త్‌ రిపోర్ట్‌ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఒక మిలియన్‌ డాలర్లు (రూ.7 కోట్లకు పైగా) అంతకంటే ఎక్కువ సంపద (స్టాక్స్‌, బాండ్ల, ఇతర రూపాల్లో) కలిగిన వారిని

Most from this category