STOCKS

News


ఎస్కార్ట్స్‌ నుంచి ఆటోమేటెడ్‌ కాన్సెప్ట్‌ ట్రాక్టర్‌

Friday 7th September 2018
auto-mobiles_main1536296903.png-20050

న్యూఢిల్లీ: ఇంజినీరింగ్‌, సాగు యంత్రాల తయారీ దిగ్గజ సంస్థ, ఎస్కార్ట్స్‌... ఆటోమేటెడ్‌  కాన్సెప్ట్‌ ట్రాక్టర్‌ను ఆవిష్కరించింది. డిజిటల్‌ వెహికల్‌ టెక్నాలజీస్‌తో రూపొందించిన ఈ ఆటోమేటెట్‌ ట్రాక్టర్‌ను 18- 20 నెలల్లో మార్కెట్లోకి తెస్తామని ఎస్కార్ట్స్‌ తెలిపింది. ఏడు దిగ్గజ సంస్థల సహకారంతో దీన్ని అందుబాటులోకి తెస్తున్నామని ఎస్కార్ట్స్‌ సీఎమ్‌డీ నిఖిల్‌ నందా తెలిపారు. మైక్రోసాఫ్ట్‌, రిలయన్స్‌ జియో, ట్రింబ్లే, సంవర్థన మదర్సన్‌ గ్రూప్‌, వాబ్‌కో, ఏవీఎల్‌, బాష్‌ కంపెనీల భాగస్వామ్యంతో ఈ ఆటోమేటెడ్‌ కాన్సెప్ట్‌ ట్రాక్టర్‌ను అందిస్తున్నామన్నారు. ఎలక్ట్రిక్‌ ట్రాన్సిమిషన్లు, ఆటానమస్‌ అప్లికేషన్లు, రిమోట్‌ వెహికల్‌ మేనేజ్‌మెంట్‌, సెన్సర్‌ ఆధారిత గైడెడ్‌ ఫార్మ్‌ అప్లికేషన్లు వంటి ఫీచర్లతో మరిన్ని యంత్రాలను అందించనున్నామని వివరించారు. గత ఏడాది ఎలక్ట్రిక్‌ కాంపాక్ట్‌ ​‍ట్రాక్టర్‌ను మార్కెట్లోకి తెచ్చామని తెలిపారు. రైతుల ఆదాయం మెరుగుపరచడం, గరిష్ట స్థాయి పంట దిగుబడులు సాధించడం లక్ష్యాలుగా ఈ సాగు యంత్రాలను తెస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన కంపెనీ వార్షిక కార్యక్రమం ఎస్‌క్లూజివ్‌ 2018లో ఆయన మాట్లాడారు. 


 



You may be interested

కార్డ్‌ లేకుండానే ఏటీఎమ్‌ల్లో క్యాష్‌ విత్‌డ్రా

Friday 7th September 2018

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులు కార్డ్‌ లేకుండానే కొన్ని ఎంపిక చేసిన ఏటీఎమ్‌ల్లో నగదును పొందవచ్చు. ఇన్‌స్టంట్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ (ఐఎమ్‌టీ) టెక్నాలజీతో నడిచే ఏటీఎంలలో తమ ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఆరంభ ఆఫర్‌గా మొదటి రెండు విత్‌డ్రాయల్స్‌కు రూ.25 లావాదేవీ ఫీజును రద్దు చేస్తున్నామని తెలిపింది. ఐఎమ్‌టీ టెక్నాలజీతో పనిచేసే 20,000కు పైగా ఏటీఎమ్‌ల్లో ప్రస్తుతం తమ ఖాతాదారులు ఈ

2020 ఏప్రిల్‌ నాటికి బీఎస్‌-6 ఇంధన లభ్యత: ప్రధాన్‌

Friday 7th September 2018

న్యూఢిల్లీ: భారత్‌ స్టేజ్‌-6 (బీఎస్‌-6) ఇంధనాన్ని 2020 నాటికి అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. అలాగే, భవిష్యత్‌ ఇంధనాల విషయంలో స్థిరత్వాన్ని తీసుకొస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. సియామ్‌ వార్షిక సదస్సులో మాట్లాడుతూ... ‘‘దేశ రాజధానిలో బీఎస్‌-6 ఇంధనం ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చాం. మా వైపు నుంచి ఎటువంటి అస్పష్టత లేదు. 2020 ఏప్రిల్‌ 1 నాటికి దేశవ్యాప్తంగా బీఎస్‌6

Most from this category