STOCKS

News


భారత మార్కెట్లోకి డుకాటీ పానిగాల్‌ వీ4ఆర్

Thursday 22nd November 2018
auto-mobiles_main1542863004.png-22284

న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్ బైక్ తయారీ దిగ్గజం డుకాటీ తాజాగా పానిగాల్‌ వీ4 ఆర్‌ బైక్‌ను భారత మార్కెట్లో  ఆవిష్కరించింది. దీని ధర రూ. 51.87 లక్షలు (ఎక్స్ షోరూం). భారత్‌లో కేవలం అయిదు బైక్‌లే విక్రయించనున్నామని, దేశవ్యాప్తంగా తమ డీలర్‌షిప్‌లలో వీటిని బుక్ చేసుకోవచ్చని డుకాటీ తెలిపింది. నవంబర్ 30లోగా బుక్ చేసుకుంటే 2019 తొలి త్రైమాసికంలో డెలివరీ ప్రారంభమవుతుందని పేర్కొంది. నవంబర్ తర్వాత బుకింగ్స్‌కు వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో డెలివరీలు ప్రారంభమవుతాయని వివరించింది. పానిగాల్ వీ4కి భారత మార్కెట్లో భారీ స్పందన లభించిందని, కొత్తగా ప్రవేశపెడుతున్న పానిగాల్ వీ4 ఆర్‌కి కూడా ఆదరణ లభించగలదని ఆశిస్తున్నట్లు డుకాటీ ఎండీ సెర్గీ కెనోవాస్ చెప్పారు. 998 సిసి ఇంజిన్‌, రేస్‌ గ్రేడ్ సస్పెన్షన్‌ తదితర ఫీచర్స్ ఇందులో ఉంటాయి. డుకాటీకి ఢిల్లీ, ముంబై, పుణె తదితర నగరాల్లో డీలర్‌షిప్‌లు ఉన్నాయి.



You may be interested

రూ.29వేల కోట్లకు నిర్మాణ యంత్రాల మార్కెట్‌

Thursday 22nd November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: నిర్మాణ రంగానికి సంబంధించిన యంత్రాల మార్కెట్‌ దేశంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 90,000 యూనిట్లను దాటుతుందని మెసె మంచెన్‌ ఇండియా కమర్షియల్‌ డైరెక్టర్‌ తుషార్‌ అలేకర్‌ చెప్పారు. బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... ‘2016-17లో భారత్‌లో 75,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.29,300 కోట్లు. 2021-22 నాటికిది రూ.56వేల కోట్ల విలువతో 1,23,000 యూనిట్లకు చేరనుంది. పట్టణీకరణ, విదేశీ పెట్టుబడుల రాక, కస్టమైజ్డ్‌ ఎక్విప్‌మెంట్‌కు డిమాండ్‌

ప్యాసింజర్‌ వాహనాల నెమ్మది!!

Thursday 22nd November 2018

ముంబై: ప్రయాణికుల వాహన విక్రయ అంచనాలను రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ రీసెర్చ్‌ తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహన(పీవీ) విక్రయాలు 9-11 శాతం రేంజ్‌లో వృద్ధి చెందుతాయని క్రిసిల్‌ గతంలో అంచనా వేసింది. ఈ అంచనాలను తాజాగా 7-9 శాతానికి తగ్గించింది. డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉండటం, పండుగల సీజన్‌లో కూడా నిల్వలు అధికంగా ఉండటం దీనికి కారణాలని వివరించింది. పీవీ విక్రయాలకు సంబంధించి క్రిసిల్‌ రీసెర్చ్‌ తన తాజా

Most from this category